Joe Biden | గతేడాది నవంబర్‌లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ట్రంప్ విజయంతో మరో పది రోజుల్లో అమెరికా అధ్యక్ష పదవి నుంచి జో బైడెన్ (Joe Biden) దిగిపోనున్నారు. ఈ నేపథ్యంలో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అధ్యక్ష ఎన్నికల పోటీల్లో తాను నిలబడి ఉంటే ట్రంప్‌ను ఓడించేవాడినని వ్యాఖ్యానించారు. మీడియా సమావేశంలో ‘ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిర్ణయంపై విచారిస్తున్నారా..? మీ నిర్ణయం ట్రంప్ గెలుపుకు దోహదపడిందని మీరు అనుకుంటున్నారా..? అని విలేకరులు ప్రశ్నించారు. దీనికి అధ్యక్షుడు బదులిస్తూ.. తాను అలా ఏమీ అనుకోవడం లేదన్నారు. తాను మొన్నటి ఎన్నికల బరిలో దిగి ఉంటే ట్రంప్‌ను కచ్చితంగా ఓండిచేవాడినని విశ్వాసం వ్యక్తం చేశారు. డెమోక్రటిక్ పార్టీలో ఐక్యత కోసమే తాను అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నట్లు బైడెన్ స్పష్టం చేశారు. ట్రంప్‌ను కమలా హారిస్ (Kamala Harris) ఓడించగలదని తాను భావించినట్లు చెప్పారు. అందుకే అధ్యక్ష ఎన్నికల్లో ఆమెకు మద్దతిచ్చినట్లు బైడెన్ చెప్పుకొచ్చారు. అందుకు కమలా సైతం తీవ్రంగా కృషి చేసినట్లు బైడెన్ వివరించారు.
JUST IN: President Biden says he could have and would have won the 2024 election, says Kamala Harris could have and would have won too.
Someone should tell him that Kamala did in fact run and did not win.
"I would have beaten Trump, could have beaten Trump, and I think that… pic.twitter.com/7oOWeSJ2hs
— Collin Rugg (@CollinRugg) January 10, 2025
81 ఏండ్ల జో బైడెన్ రెండోసారి అధ్యక్ష పదవికి పోటీ పడిన విషయం తెలిసిందే. అయితే, అనూహ్యంగా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు (quitting White House race) గతేడాది జులైలో ప్రకటించిన విషయం తెలిసిందే. ట్రంప్‌తో జరిగిన డిబేట్లో తడబాటు, ఇతరత్రా అంశాల నేపథ్యంలో అధ్యక్ష పోటీ నుంచి తప్పుకోవాలని సొంత పార్టీ నేతల నుంచి ఒత్తిడి పెరగడంతో బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం డెమోక్రటిక్ పార్టీ తరపున అభ్యర్థిగా ప్రస్తుతం ఉపాధ్యక్షురాలిగా ఉన్న కమలా హారిస్ పేరును బైడెన్ ప్రతిపాదించారు. అయితే, ఆమె నవంబర్ 5న జరిగిన ఎన్నికల్లో ట్రంప్ చేతిలో ఓటమిపాలయ్యారు.
Also Read..
Donald Trump | పోర్న్ స్టార్‌కు అక్రమంగా నగదు చెల్లింపు.. దోషిగా తేలిన తొలి అధ్యక్షుడు
Elon Musk | మస్క్ మానసిక స్థితి సరిగాలేదు! ఆత్మకథా రచయిత వెల్లడి
కార్చిచ్చులకు 10 వేల నిర్మాణాలు ఆహుతి