Donald Trump | పోర్న్ స్టార్‌కు అక్రమంగా నగదు చెల్లింపు.. దోషిగా తేలిన తొలి అధ్యక్షుడు
Donald Trump | పోర్న్ స్టార్‌కు అక్రమంగా నగదు చెల్లించాడనే ఆరోపణల్లో అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దోషిగా తేలినా శిక్ష మాత్రం పడలేదు. ఈ కేసులో ఇప్పటికే ట్రంప్‌పై అభియోగాలు నిరూపితమయ్యాయి.
- జైలు, జరిమానా విధించని కోర్టు
Donald Trump | న్యూయార్క్, జనవరి 10: పోర్న్ స్టార్‌కు అక్రమంగా నగదు చెల్లించాడనే ఆరోపణల్లో అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దోషిగా తేలినా శిక్ష మాత్రం పడలేదు. ఈ కేసులో ఇప్పటికే ట్రంప్‌పై అభియోగాలు నిరూపితమయ్యాయి. న్యూయార్క్ జడ్జి జువాన్ మెర్చాన్ శుక్రవారం తుది తీర్పు ఇచ్చారు. ట్రంప్‌ను దోషిగా పేర్కొన్న న్యాయమూర్తి.. జైలుశిక్ష, జరిమానా విధించలేదు. ఈ మేరకు ‘అన్‌కండీషనల్ డిశ్చార్జ్’ చేస్తున్నట్టు ప్రకటించారు.
ఈ కేసులో దోషులకు నాలుగేండ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు. అయితే, అమెరికా అధ్యక్షుడిగా పని చేసిన వ్యక్తికి చట్టానికి అతీతంగా ఉండే న్యాయపరమైన రక్షణ కారణంగా ట్రంప్‌నకు శిక్ష విధించలేదు. తనకు ఎలాగూ శిక్ష పడదనే కారణంతో ట్రంప్ కోర్టుకు కూడా హాజరుకాలేదు. కాగా, ఒక కేసులో దోషిగా తేలి అమెరికా అధ్యక్షుడు కాబోతున్న మొదటి వ్యక్తిగా డొనాల్డ్ ట్రంప్ నిలవనున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

