Indonesia President : మరో రెండు వారాల్లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల (Republic Day celebrations) ను ఘనంగా నిర్వహించుకునేందుకు భారత్ (India) సిద్ధమవుతోంది. జనవరి 26న దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేసియా అధ్యక్షుడు (Indonesia President) ప్రబోవో సుబియాంటో (Prabowo Subianto) హాజరుకానున్నట్లు తెలుస్తోంది. భారత్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. రిపబ్లిక్ డే వేడుకల ముఖ్య అతిథికి సంబంధించి ఎప్పుడైనా కొన్ని నెలల ముందే ప్రకటన వెలువడేది. కానీ ఈసారి మాత్రం ఇంకా ప్రకటన రాలేదు.
ప్రబోవో సుబియాంటో న్యూఢిల్లీ పర్యటన తర్వాత పాకిస్థాన్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు గతంలో పాక్ మీడియా వెల్లడించింది. కానీ ప్రస్తుతం గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరుకాబోతున్న సుబియాంటో పాకిస్థాన్ పర్యటనను వాయిదా వేసుకున్నారని ఇండోనేషియా మీడియా చెబుతోంది. ముఖ్యంగా భారత్ సలహా మేరకే ఆయన ఇస్లామాబాద్ పర్యటనను వాయిదా వేసుకున్నారని సమాచారం. భారత పర్యటనలో భాగంగా సుబియాంటో ప్రధాని నరేంద్రమోదీతో విస్తృత చర్చలు జరిపే అవకాశం ఉంది.
రెండు దేశాల మధ్య సత్సంబంధాలకు సంబంధించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా 1950 నుంచి భారత్ తన మిత్ర దేశాల అధినేతలను గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తోంది. గతేడాది ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ ముథ్య అతిథిగా రాగా.. 2023లో ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫట్టా ఎస్-సిసిని అతిథిగా వచ్చారు. 2021, 2022 సంవత్సరాల్లో కరోనా కారణంగా గణతంత్ర దినోత్సవ వేడుకలకు అతిథులను ఆహ్వానించలేదు.
అంతకుముందు 2020లో బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో, 2019లో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2018లో ఆసియా దేశాలకు చెందిన 10 మంది నాయకులు వచ్చారు. 2017లో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ రాగా.. 2016లో ఫ్రెంచ్ అప్పటి అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే, 2015లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
S. Jaishankar | భారత్ తరఫున ట్రంప్ ప్రమాణస్వీకారానికి వెళ్లనున్న విదేశాంగ మంత్రి జైశంకర్
Encounter | ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి
Water Ambulance | మహా కుంభమేళా వేళ అందుబాటులోకి వాటర్ అంబులెన్స్ సేవలు..Video
Crime news | మహిళ దారుణ హత్య.. 10 నెలలుగా ఫ్రిజ్లోనే మృతదేహం..!
Health Tips | మిమ్మల్ని నెలసరి సమస్య ఇబ్బంది పెడుతోందా.. అయితే తరచూ ఈ పండు తినండి..!