Moo Deng | ఇంటర్నెట్ సెన్సేషన్ థాయ్‌లాండ్‌కు చెందిన బేబీ హిప్పో (Baby hippo) మూ డెంగ్ (Moo Deng)కు అదృష్టం వరించింది. క్రిస్మస్ సందర్భంగా (Christmas gift) కెనడాకు చెందిన క్రిప్టోకరెన్సీ బిలియనీర్ (crypto billionaire) విటాలిక్ బుటెరిన్ పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చారు.
ఈ బేబీ హిప్పో థాయ్‌లాండ్‌లోని సి రాచా (Si Racha)లో గల ఖావో ఖీవ్ ఓపెన్ జూ (Khao Kheow Open Zoo)లో ఉంటుంది. ఈ హిప్పోకి సోషల్ మీడియాలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఐదు నెలల వయసు గల ఈ హిప్పో ఇటీవలే మైఖేల్ జాక్సన్ ఫేమస్ డ్యాన్స్ మూన్ వాక్‌తో ఇంటర్నెట్ సన్సేషన్‌గా మారిన విషయం తెలిసిందే. మూన్ వాక్ మూమెంట్స్‌తో ఈ హిప్పో అదరగొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అంతేకాదు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ డొనాల్డ్ ట్రంప్ గెలుస్తారని జోష్యం చెప్పి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలోనే బేబీ హిప్పో దీర్ఘకాలం జీవించేందుకు కెనడాకు చెందిన క్రిప్టోకరెన్సీ బిలియనీర్ భారీ విరాళం ఇచ్చారు. హిప్పో సంరక్షణ కోసం జూ నిర్వాహకులు రూ.2.51 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది.
Also Read..
Abdul Rehman Makki | లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ మృతి
Manmohan Singh | మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భారత ఆర్థికవ్యవస్థకు రూపశిల్పి : మాజీ రాష్ట్రపతి
Droupadi Murmu | మన్మోహన్ సింగ్‌కు రాష్ట్రపతి ముర్ము నివాళి