Manmohan Singh : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తీవ్ర సంతాపం తెలియజేశారు. మన్మోహన్ సింగ్ భారత ఆర్థిక వ్యవస్థకు రూపశిల్పి అని ఆయన అభివర్ణించారు. మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరనిలోటు మాత్రమే కాదని, వ్యక్తగతంగా తనకు కూడా లోటేనని అన్నారు. ఆయన తనకు చాలాకాలంగా తెలుసని, పొలైట్నెస్కు ఆయన గొప్ప ఉదాహరణ అని పేర్కొన్నారు.
ఆయన భారత ఆర్థిక వ్యవస్థకు రూపశిల్పిగా తాను భావిస్తానని, తాను ఆయనకు నివాళులు అర్పిస్తున్నానని రామ్నాథ్ కోవింద్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక సెల్ఫీ వీడియోను రిలీజ్ చేశారు. వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం సాయంత్రం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో కన్నుమూశారు.