Balochistan | పొరుగు దేశం పాకిస్థాన్ (Pakistan)లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు.
స్థానిక మీడియా కథనాల ప్రకారం.. బలూచిస్థాన్ (Balochistan)లో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. 54 మంది ప్రయాణికులతో బస్సు దక్షిణ బలూచిస్థాన్‌లోని టర్బాట్ నగరం నుంచి ఉత్తరాన 750 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజధాని క్వెట్టా (Quetta)కు వెళ్తోంది. ఈ క్రమంలో కొండ ప్రాంతంలో మలుపు వద్ద బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది (bus falls into ravine). ఈ ఘటనలో బస్సు డ్రైవర్ సహా మొత్తం 28 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సుమారు 20 మందికిపైగా ప్రయాణికులు గాయాలపాలయ్యారు.
సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హెలికాప్టర్లో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. మరోవైపు ఈ ఘటనపై ఆ దేశ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
Also Read..
American Airlines | బలమైన ఈదురుగాలులకు కొట్టుకుపోయిన విమానం.. VIDEO
Cinema Lovers Day | సినీలవర్స్‌కు గుడ్‌న్యూస్.. రూ.99కే మల్టీప్లెక్స్‌లో సినిమా చూసే అవకాశం
Bibhav Kumar | స్వాతి మలివాల్ కేసు.. తన అరెస్ట్‌ను హైకోర్టులో సవాల్ చేసిన బిభవ్ కుమార్