శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
International - Sep 09, 2020 , 09:09:09

నిలిచిన ఆక్స్‌ఫ‌ర్డ్ వ్యాక్సిన్ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్

నిలిచిన ఆక్స్‌ఫ‌ర్డ్ వ్యాక్సిన్ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్

లండ‌న్‌: ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ భాగ‌స్వామ్యంతో రూపొందుతున్న ఆస్ట్రాజెనె‌కా వ్యాక్సిన్ చివ‌రి ద‌శ ప్ర‌‌యోగాల‌ను నిలిపివేస్తున్న‌ట్లు ఆస్ట్రాజెనెకా కంపెనీ వెల్ల‌డించింది. క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌లో భాగంగా బ్రిట‌న్‌లో ఈ టీకా తీసు‌కున్న వ‌లంటీర్ల‌కు ఆరోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తాయి. దీంతో తుది ద‌శకు చేరుకున్న క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌ను ప్ర‌స్తుతానికి నిలిపివేస్తున్న‌ట్లు ఆస్ట్రాజెనెకా ప్ర‌క‌టించింది. ప్ర‌యోగ ప్రామాణిక ప్ర‌క్రియ‌, వ్యాక్సిన్ భ‌ద్ర‌త‌పై పూర్తిస్థాయి స‌మీక్ష కోసం ఈమేర‌కు నిర్ణ‌యం తీసుకున్నామ‌ని తెలిపింది. దీంతో ప‌లు దేశాల్లో జ‌రుగుతున్న ఈ వ్యాక్సిన్ ప్రయోగం నిలిచిపోయింది.   

ఏదైనా వ్యాక్సిన్ త‌యారు చేస్తున్న‌ప్ప‌డు క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ స‌మయంలోనే లోపాల‌ను గుర్తించ‌డం సాధార‌ణ‌మే. అయితే కోవిడ్‌-19 వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్‌లో ఇదే మొద‌టిసారి. క‌రోనా వ్యాక్సిన్ రేసులో ఆక్స్‌ఫ‌ర్డ్ టీకా ముందువ‌రుస‌లో ఉన్న విష‌యం తెలిసిందే. కాగా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా మూడో ద‌శ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌లో ఉన్న తొమ్మిక వ్యాక్సిన్ల‌లో ఆస్ట్రాజెనెకా ఒక‌టి. 


logo