Bangladesh | పొరుగు దేశం బంగ్లాదేశ్ (Bangladesh)లో పరిస్థితి అదుపుతప్పింది. ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకిస్తూ చెలరేగిన హింస తీవ్రరూపం దాల్చింది. వేలాది మంది నిరసనకారులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆందోళనకారులు ఆయుధాలను చేతపట్టి వాహనాలు, దుకాణాలు, కార్యాలయాలను ధ్వంసం, దగ్ధం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లపై అధికార పార్టీ నేతల నివాసాలు, కార్యాలయాలపై కూడా దాడులకు తెగబడుతున్నారు.
ఆదివారం మొదలైన ఈ అల్లర్లు సోమవారం రెండో రోజు కూడా కొనసాగాయి. ఇవాళ వేలాది మంది నిరసనకారులు రాజధాని ఢాకాలో విధ్వంసం సృష్టించారు. జాతిపిత షేక్ ముజిబుర్ విగ్రహాన్ని ధ్వసం చేశారు. ఇక ఢాకాలోని పీఎం అధికారిక నివాసం గణభబన్‌ను ముట్టడించారు. కొందరు నిరసనకారులు పీఎం నివాసంలోకి చొచ్చుకెళ్లారు. దీంతో బంగ్లా ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina), ఆమె సోదరి షేక్ రెహానా బంగ్లాను వీడి సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ అల్లర్లలో ఇప్పటి వరకూ 300 మందికిపైగా మృతి చెందినట్లు స్థానిక మీడియా నివేదించింది.
దేశంలో సైనిక పాలన
తాజా హింస నేపథ్యంలో ఆర్మీహెచ్చరికలతో ప్రధాని పదవికి హసీనా రాజీనామా చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అనంతరం సోదరితో కలిసి ఢాకా ప్యాలెస్ నుంచి ఆర్మీ హెలికాప్టర్లో బంగ్లా మీదుగా భారత్‌కు తరలివెళ్లినట్లు వెల్లడించింది. ప్రస్తుతం బంగ్లాలో కర్ఫూ కొనసాగుతోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో దేశంలో ప్రభుత్వ ఏర్పాటుకు సైన్యం సిద్ధమైంది. లా అండ్ ఆర్డర్ మొత్తం సైన్యం చేతుల్లోకి వెళ్లిపోయింది. త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న ఆర్మీ చీఫ్ ప్రకటించారు. మరోవైపు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సైన్యం మొహరించింది.
‘ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు. దేశాన్ని తాత్కాలిక ప్రభుత్వం నడుపుతుంది. దేశంలో తిరిగి శాంతిని నెలకొల్పుతాం. ప్రజలు సంయమనం పాటించాలి. తాత్కాలిక ప్రభుత్వం పాలనను పర్యవేక్షిస్తుంది. అన్ని రాజకీయా పార్టీలను సంప్రదిస్తాం. సంక్షోభానికి పరిష్కారం కనుగొంటాం. విద్యార్థులు నిరసనలు ఆపాలని కోరుతున్నాం’ అని బంగ్లా ఆర్మీ చీఫ్ వాకర్-ఉజ్-జమాన్ తెలిపినట్లు రాయిటర్స్ నివేదించింది.
PM Hasina has resigned, interim government to run the country. We will return peace to the country. We ask citizens to stop violence. We will investigate all killings that have happened over the past few weeks," says Bangladesh's army chief Waker-uz-Zaman- reports Reuters.
— ANI (@ANI) August 5, 2024
Also Read..
Sheikh Hasina: రాజీనామా చేసిన షేక్ హసీనా ఎక్కెడికి వెళ్లారు?
Emergency Landing | ప్రయాణికురాలి తలలో పేలు.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
Iran | ఈరోజే ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి..?