Earthquake | పాకిస్థాన్లో భూకంపం.. జమ్మూ కశ్మీర్లోనూ ప్రకంపనలు
Earthquake | పొరుగుదేశం పాకిస్థాన్ (Pakistan)లో భూకంపం (Earthquake) సంభవించింది.
Earthquake | పొరుగుదేశం పాకిస్థాన్ (Pakistan)లో భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 5.8గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Center for Seismology) వెల్లడించింది. పాక్ రాజధాని ఇస్లామాబాద్ సమీపంలో శనివారం మధ్యాహ్నం 1 గంట (స్థానిక కాలమానం ప్రకారం) సమయంలో భూ ప్రకంపనలు నమోదైనట్లు తెలిపింది.
భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది. ఈ భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ భూకంపం ధాటికి జమ్ముకశ్మీర్లోనూ భూమి కంపించింది.
An earthquake of magnitude 5.8 on the Richter scale hit Pakistan at 1:00 PM (IST): National Center for Seismology pic.twitter.com/J4X2P28f9I
— ANI (@ANI) April 12, 2025
ఇవాళ ఉదయం పసిఫిక్ మహాసముద్రంలోని ద్వీప దేశమైన పపువా న్యూ గునియాలో (Papua New Guinea) భారీ భూకంపం (Earthquake) సంభవించిన విషయం తెలిసిందే. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.2గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే (US Geological Survey) తెలిపింది. కోకోపో (Kokopo) పట్టణానికి ఆగ్నేయంగా 115 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్లు పేర్కొంది. 72 కిలోమీటర్ల (44 మైళ్ల) లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం అక్కడ సునామీ హెచ్చరికలు ఏమీ జారీ చేయలేదు.
Also Read..
Earthquake | పపువా న్యూ గునియాలో భారీ భూకంపం.. వారంలో రెండోసారి
Waqf Act | బెంగాల్లో వక్ఫ్ నిరసనలు హింసాత్మకం.. 110 మంది అరెస్ట్
Terror attacks | దేశంలో ఉగ్రవాదులు దాడి చేయొచ్చు.. ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరిక
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

