Earthquake | పసిఫిక్ మహాసముద్రంలోని ద్వీప దేశమైన పపువా న్యూ గునియాలో (Papua New Guinea) మరోసారి భారీ భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.2గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే (US Geological Survey) తెలిపింది. కోకోపో (Kokopo) పట్టణానికి ఆగ్నేయంగా 115 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్లు పేర్కొంది. 72 కిలోమీటర్ల (44 మైళ్ల) లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం అక్కడ సునామీ హెచ్చరికలు ఏమీ జారీ చేయలేదు.
కాగా, పపువా న్యూ గునియాలో భూకంపం సంభవించడం వారంలో ఇది రెండోసారి. గత వారం సరిగ్గా ఇదే రోజు అంటే శనివారం పశ్చిమ న్యూ బ్రిటన్ ప్రావిన్స్ (New Britain island)లో భూమి కంపించింది. కింబే పట్టణానికి 194 కిలోమీటర్ల దూరంలో, 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. దీంతో అప్పుడు సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి (Tsunami warning Issue). ఇలా వరుస భూకంపాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Also Read..
Gambling Operation: అమెరికాలో గ్యాంబ్లింగ్ ఆపరేషన్.. భారత సంతతి రాజకీయవేత్తపై అభియోగాలు
Tulsi Gabbard | ఈవీఎంల హ్యాకింగ్ సాధ్యమే.. మళ్లీ పేపర్ బ్యాలట్కు మళ్లాలి: తులసీ గబ్బర్డ్
OPT Work Visa | ఓపీటీ ప్రోగ్రామ్ను రద్దు!.. అనిశ్చితిలో అమెరికా చదువు!