Ajit Doval | రష్యా నుంచి చమురు దిగుమతి (Russian Oil Imports) చేసుకుంటున్న భారత్ (India)పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన అక్కసును వెళ్లగక్కుతున్న విషయం తెలిసిందే. భారత్‌పై అదనపు సుంకాలు విధించనున్నట్లు హెచ్చరించారు. అయితే, ట్రంప్ టారిఫ్ బెదిరింపులకు వెనక్కి తగ్గని భారత్.. రష్యాతో సంబంధాలు మరింత బలోపేతం చేసే దిశగా తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది.
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ (Ajit Doval) రష్యా పర్యటనకు వెళ్లారు. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. అయితే, దోవల్ పర్యటన ముందుగానే ఖరారైనట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రక్షణ, ఇంధన సంబంధాల బలోపేతమే ఈ పర్యటన ముఖ్య లక్ష్యంగా పేర్కొన్నాయి. పలు అంశాలపై రష్యా అధికారులతో దోవల్ కీలక చర్చలు జరిపే అవకాశం ఉందని సమాచారం. ఈ నెలాఖరులో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా మాస్కోకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం.
Also Read..
Donald Trump: రష్యా నుంచి యురేనియం, రసాయనాలు దిగుమతి.. ఆ ప్రశ్నకు ట్రంప్ ఏమన్నారంటే
Ind vs US | రష్యా నుంచి దిగుమతులను మీరెందుకు ఆపలేదు.. అమెరికాకు భారత్ కౌంటర్