Donald Trump | గతేడాది నవంబర్‌లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో గత నెల 20న అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టారు. ఇక ఈ ఎన్నికల్లో ట్రంప్ గెలుపు వెనుక ప్రపంచ కుబేరుడు, టెస్లా బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk) ఉన్న విషయం తెలిసిందే. ట్రంప్‌కు మద్దతుగా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అంతేకాదు.. ట్రంప్ ప్రచారం కోసం మస్క్ విరాళం కూడా ఇచ్చారు. తన గెలుపులో కీలక పాత్ర పోషించిన మస్క్‌కు ట్రంప్ తన కార్యవర్గంలో కీలక పదవి కట్టబెట్టారు. ప్రభుత్వ వ్యవహారాల్లో మస్క్‌కు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ.. ఆయన సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. దీంతో ట్రంప్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే కొందరు ట్రంప్‌ను అవమానించేలా ఏఐ ద్వారా ఓ వీడియో (AI video)ని సృష్టించారు. ఎలాన్ మస్క్ పాదాలను ట్రంప్ ముద్దాడుతున్నట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా వీడియోను క్రియేట్ చేసి.. ఆ వీడియోను ఏకంగా యూఎస్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ బిల్డింగ్ (హెచ్ యూడీ) లోని టీవీల్లో ప్రదర్శించారు. అధికారులు ఈ వీడియోని గమనించి ప్రసారం ఆపేలోపే.. అక్కడున్న కొందరు తమ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పెట్టేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇటీవల ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్రూత్ సోషల్‌లో ‘లాంగ్ లివ్ ది కింగ్..!’ అంటూ ఓ పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్యాప్షన్‌తోనే దుండులు వీడియోను సృష్టించి వైరల్ చేస్తున్నారు.
this video of Trump kissing Elon Musk’s feet is playing in the federal Department of Housing and Urban Development cafeteria this morning
(per source @HUDgov) pic.twitter.com/hrojPdLDHQ
— Rachel Cohen (@rmc031) February 24, 2025
Also Read..
Vivek Ramaswamy | ఓహియో గవర్నర్ పోటీలో వివేక్ రామస్వామి.. సిన్సినాటిలో ఎన్నికల ప్రచారం
Highway Collapses | ఘోర ప్రమాదం.. హైవేపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలి ఇద్దరు మృతి.. షాకింగ్ వీడియో
Golden Toilet: 30 కోట్ల ఖరీదైన బంగారు టాయిలెట్‌ను.. 5 నిమిషాలు చోరీ చేసిన దొంగలు