Highway Collapses | దక్షిణ కొరియా (South Korea)లో ఘోర ప్రమాదం సంభవించింది. హైవేపై నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జి కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
దక్షిణ కొరియా రాజధాని సియోల్ (Seoul)కు దక్షిణంగా ఉన్న చియోనాన్ (Cheonan) నగరంలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం 9:49 సమయంలో బ్రిడ్జికి సపోర్ట్‌గా ఉండే 50 మీటర్ల పొడవైన ఉక్కు నిర్మాణాలను కార్మికులు క్రేన్ సాయంతో తరలిస్తున్నారు. ఆ టైంలో అప్పటికే అమర్చిన ఇనుప నిర్మాణాలు ఒక్కసారిగా ఒకదాని తర్వాత ఒకటి కూలిపోయాయి.
ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బ్రిడ్జ్ కూలిపోతున్న దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
BIG BREAKING NEWS
At least 3 construction workers killed, 5 injured after portion of highway overpass collapsed near Anseong, South Korea
🇰🇷🇰🇷‼️‼️‼️‼️‼️‼️‼️‼️‼️‼️‼️ pic.twitter.com/qk6LSajfLe
— WW3 Monitor (@WW3_Monitor) February 25, 2025
Also Read..
Canada | స్టడీ, వర్క్ వీసాలపై కెనడా కొత్త రూల్స్.. ఎలాన్ మస్క్ పౌరసత్వానికి ఎసరు!
2 వేల మంది యూఎస్ ఎయిడ్ ఉద్యోగులపై వేటు