వాషింగ్టన్: యూఎస్ ఎయిడ్‌లో 2 వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం ప్రకటించారు. ఇదే సమయంలో మరికొందరిని చెల్లింపు సెలవుల కింద ఇంటికి పంపాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని యూఎస్ ఎయిడ్ ఉద్యోగులకు ఒక నోటీస్ ద్వారా, ఆన్లైన్ ద్వారా తెలియజేశారు.
‘ఆదివారం అర్ధరాత్రి 11.59 వరకు ముఖ్యమైన బాధ్యతల్లో ఉన్నవారు తప్ప ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిగతా యూఎస్ ఎయిడ్ ఉద్యోగులందరినీ పరిపాలన పరమైన సెలవులో ఇంటికి పంపిస్తున్నాం’ అని నోటీస్‌లో పేర్కొన్నారు. ఈ నిర్ణయం 2 వేల మంది ఉద్యోగులపై ప్రభావం చూపుతుందని ఆ నోటీస్ పేర్కొంది. ఉద్యోగుల తొలగింపునకు కోర్ట్ అనుమతించాకే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.