Smart Notebook | ప్రపంచంలోనే తొలి ఏఐ ఆధారిత పునర్వినియోగ స్మార్ట్ నోట్‌బుక్.. హైదరాబాదీ టెకీలు అద్భుత సృష్టి
సాంకేతిక రంగంలో కృత్రిమమేధ (ఏఐ) విప్లవాత్మక మార్పులను తీసుకొస్తున్నది. అరచేతిలో ఇమిడే స్మార్ట్‌ఫోన్, నోట్‌బుక్‌ల అడ్వాన్స్డ్ వెర్షన్లు ఏఐ టెక్నాలజీతో కొత్త రూపును సంతరించుకొంటున్నాయి.
- ఈ స్మార్ట్ నోట్‌బుక్ స్పెషల్ గురూ!
Smart Notebook | న్యూయార్క్, ఫిబ్రవరి 24: సాంకేతిక రంగంలో కృత్రిమమేధ (ఏఐ) విప్లవాత్మక మార్పులను తీసుకొస్తున్నది. అరచేతిలో ఇమిడే స్మార్ట్‌ఫోన్, నోట్‌బుక్‌ల అడ్వాన్స్డ్ వెర్షన్లు ఏఐ టెక్నాలజీతో కొత్త రూపును సంతరించుకొంటున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన క్వాడ్రిక్ ఐటీ సంస్థ ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత పునర్వినియోగ స్మార్ట్ నోట్‌బుక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. డిజిటల్ స్మార్ట్ నోట్‌బుక్‌ల మాదిరి కాకుండా చేతిలో పుస్తకాన్ని పట్టుకొన్నట్టు ఉండే ఈ ఏఐ నోట్‌బుక్‌ను నీటితో సులభంగా శుభ్రపర్చవచ్చు. ఏకంగా 100 సార్లు వాడుకోవచ్చు.
ఈ నోట్‌బుక్‌పై రాసే హ్యాండ్రైటెడ్ నోట్స్‌ను డిజిటల్ టెక్ట్స్‌గా మార్చి క్లౌడ్ స్టోరేజీలోనూ భద్రపర్చుకోవచ్చు. ఈ మేరకు నోట్‌బుక్‌ను అభివృద్ధి చేసిన హైదరాబాదీ టెకీలు కేసరి సాయికృష్ణ సాబ్నివీశు, రఘురాం తాతవర్ధి, సుమన్ బాలబొమ్ము పేర్కొన్నారు. తమ డివైజ్‌తో కాగితపు వాడకాన్ని తగ్గించి పర్యావరణానికి మేలు చేయవచ్చని సాయికృష్ణ ఈ సందర్భంగా తెలిపారు. ఈ వినూత్న స్మార్ట్ నోట్‌బుక్, దాని వివరాలను హైదరాబాద్‌లో జరుగనున్న బయోఏషియా-2025 సదస్సులో ప్రదర్శించనున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

