Canada | స్టడీ, వర్క్ వీసాలపై కెనడా కొత్త రూల్స్.. ఎలాన్ మస్క్ పౌరసత్వానికి ఎసరు!
కెనడా ప్రభుత్వం వలసదారుల నిబంధనల్లో భారీ మార్పులు తీసుకొచ్చింది. ఇమ్మిగ్రేషన్ అండ్ రెఫ్యూజీ ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్ పేరుతో రూపొందించిన ఈ నిబంధనలు జనవరి 31 నుంచి అమల్లోకి వచ్చాయి. వీటి ద్వారా బోర్డర్ అధికారులకు మరిన్ని అధికారాలు లభించాయి. ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్స్ (ఈటీఏ), టెంపరరీ రెసిడెంట్ వీసా (టీఆర్వీ) వంటి డాక్యుమెంట్లను రద్దు చేసే అధికారం అధికారులకు ఉంటుంది.
- వీసాల రద్దు అధికారాలు బోర్డర్ అధికారులకు భారతీయులపై ప్రభావం
Canada | న్యూఢిల్లీ : కెనడా ప్రభుత్వం వలసదారుల నిబంధనల్లో భారీ మార్పులు తీసుకొచ్చింది. ఇమ్మిగ్రేషన్ అండ్ రెఫ్యూజీ ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్ పేరుతో రూపొందించిన ఈ నిబంధనలు జనవరి 31 నుంచి అమల్లోకి వచ్చాయి. వీటి ద్వారా బోర్డర్ అధికారులకు మరిన్ని అధికారాలు లభించాయి. ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్స్ (ఈటీఏ), టెంపరరీ రెసిడెంట్ వీసా (టీఆర్వీ) వంటి డాక్యుమెంట్లను రద్దు చేసే అధికారం అధికారులకు ఉంటుంది. ఇతర దేశాల నుంచి కెనడాకు విద్య, ఉద్యోగాలు, తాత్కాలిక బస కోసం వెళ్లేవారిపై, మరీ ముఖ్యంగా భారతీయులపై దీని ప్రభావం పడుతుంది.
వివిధ కారణాలను చూపించి, ఈటీఏ, టీఆర్వీ, వర్క్ పర్మిట్, స్టడీ పర్మిట్లను కెనడా ఇమ్మిగ్రేషన్, బోర్డర్ అధికారులు రద్దు చేయవచ్చు. తప్పుడు సమాచారం ఇవ్వడం, క్రిమినల్ రికార్డు ఉండటం వంటి కారణాలను చూపి రద్దు చేయవచ్చు. నిర్ణీత గడువు ముగిసిన తర్వాత కెనడా నుంచి తిరిగి వెళ్లిపోతానని వీసాదారు సంబంధిత అధికారికి నమ్మకం కలిగే విధంగా చెప్పలేకపోయినా ఆ పర్మిట్‌ను రద్దు చేయవచ్చు. పర్మిట్లు రద్దయితే కెనడా నౌకాశ్రయాల్లోకి ప్రవేశించే అవకాశం ఉండదు.
మస్క్ కెనడా పౌరసత్వానికి ఎసరు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సన్నిహిత సంబంధాలు.. బిలియనీర్ ఎలాన్ మస్క్ కెనడా పౌరసత్వానికి ఎసరు తెచ్చిపెట్టింది. మస్క్ కెనడా పౌరసత్వాన్ని రద్దు చేయాలని 1.5 లక్షల మంది పార్లమెంటరీ పిటిషన్‌పై సంతకం చేశారు. డొనాల్డ్ ట్రంప్‌నకు సలహాదారు, డోజ్ హెడ్‌గా వ్యవహరిస్తున్న మస్క్.. కెనడా జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ ఫిబ్రవరి 28న హౌస్ ఆఫ్ కామన్స్‌లో పార్లమెంటరీ పిటిషన్ దాఖలైంది. మస్క్ కెనడా పాస్‌పోర్ట్, పౌరసత్వాన్ని వెంటనే రద్దు చేయాలని తమ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడోని పిటిషన్లో కోరారు. ఆదివారం రాత్రి నాటికి పిటిషన్‌పై సంతకం చేసిన వారి సంఖ్య 1,57,000కి చేరుకుంది. మస్క్ తల్లి ‘మేయి మస్క్’ కెనడియన్. తద్వారా ఆయనకు కెనడా పౌరసత్వం కూడా లభించింది. కెనడాపై డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న ధోరణి ఆ దేశస్థుల్ని ఆగ్రహానికి గురిచేస్తున్నది. కెనడా దిగుమతులపై టారిఫ్‌లు పెంచుతానని, అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరాలంటూ కెనడాపై ట్రంప్ బెదిరింపులకు దిగటం కెనడియన్లను తీవ్రంగా రెచ్చగొట్టింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allu Arjun | అల్లు అర్జున్ ఒక్క పోస్ట్‌తో మళ్లీ మొదలైన మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్.. రజినీకాంత్‌పై ప్రశంసలే కారణమా?
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

