Donald Trump | అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump)నకు మరో షాక్ తగిలింది. 2021, జనవరి ఆరో తేదీన జరిగిన క్యాపిటల్ హిల్ (US Capitol) అటాక్ కేసులో కొలరాడో కోర్టు ఇటీవలే సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ చేసేందుకు ఆయన అనర్హుడని ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికాలోని మరో రాష్ట్రం కూడా కొలరాడో (Colorado) కోర్టు తీర్పును పాటించింది. అమెరికా ప్రెసిడెంట్ ప్రైమరీ ఎన్నికల్లో రాష్ట్ర బ్యాలెట్‌కు ట్రంప్ అనర్హుడంటూ మైనే (Maine) రాష్ట్రం గురువారం ప్రకటించింది.
ఈ మేరకు ఆ రాష్ట్ర ఎన్నికల అధికారి.. 2024లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి ట్రంప్‌ను అనర్హుడిగా గురువారం ప్రకటించారు. మైనే అధికారుల తరహాలో మరికొన్ని రాష్ట్రాలు కూడా కొలరాడో తీర్పును పాటిస్తే మాత్రం ట్రంప్ అధ్యక్ష ఎన్నికల పోటీలకు అనర్హుడవుతారు. మరోవైపు కొలరాడో రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానమిచ్చిన తీర్పుపై ఆ రాష్ట్ర రిపబ్లికన్ పార్టీ బుధవారం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌నకు కొలరాడో కోర్టు షాకిచ్చింది. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ చేసేందుకు ఆయన అనర్హుడని ప్రకటించింది. రాష్ట్ర రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది. 2021లో కేపిటల్ భవనంపై జరిగిన దాడి కేసులో ట్రంప్ ప్రమేయాన్ని నిర్ధారించి రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్షుడిగా అతని పేరును బ్యాలెట్లోంచి తొలగించాలని ఆదేశించింది. తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడానికి ట్రంప్‌నకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న వ్యక్తిని న్యాయస్థానం అనర్హుడిగా ప్రకటించడం ఇదే ప్రథమం.
Also Read..
kids sleeping | కదులుతున్న కారుపై నిద్రిస్తున్న చిన్నారులు.. వీడియో వైరల్
Storm Gerrit | బ్రిటన్ను వణికిస్తున్న గెరిట్ తుఫాను.. ల్యాండింగ్ సమయంలో కుదుపులకు లోనైన విమానం
Prajavani | ప్రారంభమైన ప్రజావాణి.. చలిని కూడా లెక్కచేయకుండా తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో జనాలు