శనివారం 06 మార్చి 2021
International - Jan 25, 2021 , 18:35:24

నేపాల్‌ ప్రధాని ఓలి నివాసం వద్ద నిరసనలు

నేపాల్‌ ప్రధాని ఓలి నివాసం వద్ద నిరసనలు

కాఠ్మండు: నేపాల్‌ ఆపద్ధర్మ ప్రధాని కేపీ శర్మ ఓలి నివాసం వద్ద కొందరు ఆందోళనకారులు సోమవారం నిరసన తెలిపారు. పార్లమెంట్‌ను రద్దు చేయడం, ఓ న్యాయవాదిపై ఆయన వ్యాఖ్యలు చేయడంపై ఆందోళనకు దిగారు. ఓలికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

కాగా, రాజధాని కాఠ్మండులో ప్రధాని వంటి ప్రముఖుల నివాసాలు ఉన్న నిషేధిత ప్రాంతంలో నిరసనలకు దిగినవారిని నీటి ఫిరంగులతో చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. కొంత ప్రతిఘటన తర్వాత మానవ హక్కుల కార్యకర్తలు, పీస్‌ సొసైటీకి చెందిన పలువురిని అరెస్ట్‌ చేసి వాహనంలో పోలీస్‌ క్లబ్‌కు తరలించారు. 

నేపాల్‌ ప్రధాని ఓలి గత ఏడాది డిసెంబర్‌ 20న పార్లమెంట్‌ను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు పిలుపునిచ్చారు. అయితే దీనిని వ్యతిరేకిస్తూ ఆ దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఓలి పార్లమెంట్‌ రద్దు నిర్ణయంతో అధికార నేపాల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ రెండుగా చీలింది. ఆదివారం సమవేశమైన వైరి వర్గం కేంద్ర కమిటీ ఆపద్ధర్మ ప్రధాని ఓలిని పార్టీని నుంచి బహిష్కరించింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo