ఆఫ్ఘనిస్థాన్‌లో ఓ 20 ఏండ్ల విద్యార్థిని తాలిబన్ల కంటపడకుండా కటుంబంతో కలిసి దాక్కుంది. తమ కుటుంబం దేశం విడిచిపెట్టిపోయే అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నది. ఎందుకంటే తను లెస్బియన్. ఈ విషయం తెలిసిందంటే తాలిబన్లు తనను బతుకనివ్వరు. తాలిబన్ సర్కారు తనను కచ్చితంగా టార్గెట్ చేసి చంపేస్తుంది.అందుకే ‘దొరికితే వాళ్లు నన్ను ఏమాత్రం జాలి, దయ చూపకుండా చంపేస్తారు. నా భద్రత కోసం దయచేసి నా పూర్తిపేరు, చిరునామా రాయకండి’ అని ఆ విద్యార్థిని మీడియాను వేడుకున్నది.
ఎల్జీబీటీ కమ్యూనిటీకి చెందిన ఫరాజ్ అనే ఓ 25 ఏండ్ల వ్యక్తి కూడా తాలిబన్లు తనను ఎక్కడ చంపేస్తారోనని భయంతో వణికిపోతున్నాడు. గే అయిన ఫరాజ్ తన ముగ్గురు కొడుకులతో కలిసి ఉంటున్నాడు. ఒకవేళ తాము తాలిబన్ల కంటపడితే కుటుంబం మొత్తాన్ని కిడ్నాప్ చేసి కిరాతకంగా హతమారుస్తారని భయపడుతున్నాడు. అందుకే ఎంత త్వరగా దేశం దాటితే అంత మంచిదని ఆత్రపడుతున్నాడు. ‘ప్రత్యేకించి గే ల కోసం తాలిబన్లు వెతుకుతున్నారు. వాళ్లు గల్లీగల్లీకి వెళ్లి జల్లెడ పడుతున్నారు. నా కుటుంబాన్ని దేశం దాటించండి’ అంటూ తెలిసిన వాళ్లని ప్రాధేయపడుతున్నాడు.
పై రెండు ఉదాహరణలు చాలు.. ఆఫ్ఘనిస్థాన్‌లో ఎల్జీబీటీ కమ్యూనిటీకి చెందిన వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవడానికి. ఆఫ్ఘనిస్థాన్‌ను టేకోవర్ చేసినప్పటి నుంచే మహిళల హక్కులపై ఉక్కుపాదం మోపుతున్న తాలిబన్లు ఇప్పుడు స్వలింగ సంపర్కులను వెటాడుతున్నారు. తాజాగా ఎల్జీబీటీ కమ్యూనిటీకి చెందిన ఓ గే పై తాలిబన్లు దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా అతనిపై అత్యాచారానికి ఒడిగట్టారు.
అసలేం జరిగిందంటే.. హనాన్ (మారు పేరు) అనే గే ఆఫ్ఘన్ నుంచి బయటపడటం కోసం ఓ వ్యక్తి సాయం కోరాడు. ఆ సాయం చేస్తానన్న వ్యక్తిని కలువడానికి ముందు మూడు వారాలపాటు సామాజిక మాధ్యమాల్లో అతనితో మాట్లాడాడు. అయితే, అతను తాలిబన్ వ్యక్తేనని తీరా వారి వలలో చిక్కిన తర్వాతగానీ తెలుసుకోలేకపోయాడు. హనాన్ వారు చెప్పిన చోటుకు వెళ్లగానే ఇద్దరు తాలిబన్లు అతనిపై దాడి చేశారు. తీవ్రంగా కొట్టి ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం గురించి తెలిసి ఆఫ్ఘన్లో స్వలింగ సంపర్కులు హడలెత్తిపోతున్నారు.
కాగా, ఈ ఘటనపై ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన ఎల్జీబీటీ హక్కుల ఉద్యమకారుడు ఆర్టెమిస్ అక్బరీ తీవ్రంగా మండిపడ్డారు. ప్రస్తుతం టర్కీలో తలదాచుకుంటున్న ఆయన.. కొత్త పాలన అందిస్తామన్న తాలిబన్ల హామీలు నీటిపై రాతలేనని స్పష్టమైందంటూ మండిపడ్డారు. తాలిబన్లు స్వలింగ సంపర్కులను గుర్తించేందుకు సామాజిక మాధ్యమాలను వాడుకుంటున్నారని, సామాజిక మాధ్యమాల్లో ఖాతా తెరిచి తమను తాము ఎల్జీబీటీ కమ్యూనిటీకి చెందిన వారిగా పరిచయం చేసుకుంటున్నారని అక్బరీ చెప్పారు. హనాన్ను కూడా ఇలాగే పరిచయం చేసుకొని అఘాయిత్యానికి పాల్పడ్డారని వెల్లడించారు.
ఇక తాలిబన్లు ఎరేసి, దొరకబట్టి, స్వలింగ సంపర్కులపట్ల వ్యవహరించే తీరును పూసగుచ్చినట్లు వివరించారు ఆఫ్ఘనిస్థాన్‌లోని ఎల్జీబీటీ కమ్యూనిటీకి చెందిన రచయిత నీమత్ సదాత్. “స్వలింగ సంపర్కులను పంటలో కలుపు మొక్కలుగా తాలిబన్లు భావిస్తారు. వారిని ఏరివేయాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. ‘ఎరవేయడం, చంపడం, శవాన్ని ఛిద్రం చేయడం’ ఇది వారు స్వలింగ సంపర్కుల పట్ల వ్యవహరించే తీరు. ఆన్లైన్ మాధ్యమాలు, బహిరంగ ప్రదేశాల్లో ఎరవేసి బాధితులను పట్టుకుంటారు. ఏకాంత ప్రదేశాలకు తీసుకెళ్లి హతమారుస్తారు. వారి మృతదేహాలను చిధ్రం చేస్తారు” అని నీమత్ సదాత్ పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Talibanism : వ్యక్తిని హెలికాప్టర్‌కు కట్టి తిప్పారు.. వీడియో వైరల్
US Army : ఆయుధాలను ధ్వంసం చేసిన అమెరికా.. కారణమేంటంటే..?
సౌదీ అరేబియా విమానాశ్రయంపై డ్రోన్ దాడి.. విమానం ధ్వంసం
Afghanisthan boy: పోలీసుల అదుపులో ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన 17 ఏండ్ల బాలుడు