శ్రీనగర్: ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన ఓ 17 ఏండ్ల బాలుడిని ( Afghanisthan boy ) జమ్ముకశ్మీర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కథువా జిల్లాలోని జమ్ముకశ్మీర్ ఎంట్రీ పాయింట్ అయిన లఖన్‌పూర్ కొవిడ్ టెస్టింగ్ సెంటర్ దగ్గర ఉండగా బాలుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలుడు తన పేరు అబ్దుల్ రహమాన్ అని, తన తండ్రి పేరు అబ్దుల్ రషీద్ అని చెబుతున్నట్లు వెల్లడించారు. బాలుడి దగ్గర పాస్‌పోర్టు, వీసా కూడా ఉన్నాయని చెప్పారు.
ఆఫ్ఘనిస్థాన్ దేశాన్ని ఇటీవల తాలిబన్లు ఆక్రమించిన నేపథ్యంలో అక్కడి పౌరులు కనిపిస్తే అక్రమంగా చొరబడ్డారా అనే కోణంలో పోలీసులు ఎంక్వయిరీ చేస్తున్నారు. తాజాగా అబ్దుల్ రహమాన్‌ను కూడా లఖన్‌పూర్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఎంక్వయిరీ చేస్తున్నారు. కాగా, ఇవాళ్టితో ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ పూర్తయ్యింది. ఇవాళ అమెరికా సేనలకు చెందిన ఆఖరి విమానం ఆఫ్ఘనిస్థాన్ నుంచి వెళ్లిపోయింది.