బుచారెస్ట్ చేరుకున్న ఎయిరిండియా విమానం
హైదరాబాద్ : ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు చర్యలను కేంద్రం వేగవంతం చేసింది. ముంబై నుంచి వెళ్లిన ఎయిరిండియా విమానం ఇవాళ ఉదయం రోమేనియాలోని బుచారెస్ట్కు చేరుకుంది. బుచారెస్ట్ నుంచి ఎయిరిండియా విమానంలో భారత్కు విద్యార్థులను తరలించనున్నారు. ఈ విమానం సాయంత్రం 4 గంటలకు ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు చేరుకోనుంది. ఉక్రెయిన్ నుంచి వచ్చే ఈ విద్యార్థులకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్వాగతం పలుకనున్నారు.
ఉక్రెయిన్లోని భారతీయులకు కీవ్లోని రాయబార కార్యాలయం కీలక సూచనలు చేసింది. అధికారులతో సమన్వయం లేకుండా సరిహద్దు పోస్టులకు వెళ్లొద్దని సూచించింది. సరిహద్దు పాయింట్ల వద్ద పరిస్థితి సున్నితంగా ఉందని కీవ్ రాయబార కార్యాలయం ప్రకటించింది. భారతీయుల తరలింపునకు మా ఎంబసీలతో పని చేస్తున్నామని అధికారులు తెలిపారు. ముందస్తు సమాచారం లేకుండా వెళ్తే సాయం చేయడం ఎంబసీకి కష్టమని చెప్పారు. ఉక్రెయిన్ పశ్చిమ నగరాల్లో వసతులు ఉన్న చోట ఉండటం సురక్షితమని తెలిపారు.
A special flight of Air India AI-1943 lands at Bucharest in Romania for the evacuation of stranded Indians. pic.twitter.com/YGYoVGMcQS
— ANI (@ANI) February 26, 2022
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

