Realme GT 6T |త్వరలో భారత్ మార్కెట్లోకి రియల్మీ జీటీ 6టీ.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Realme GT 6T | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ (Realme) తన రియల్మీ జీటీ 6టీ (Realme GT 6T) ఫోన్‌ను త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Realme GT 6T | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ (Realme) తన రియల్మీ జీటీ 6టీ (Realme GT 6T) ఫోన్‌ను త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. గత నెలలో చైనాలో ఆవిష్కరించిన రియల్మీ జీటీ నియో 6 ఎస్ఈ (Realme GT Neo 6 SE) ఫోన్‌ను రీబ్రాండ్ చేసి రియల్ మీ జీటీ 6టీగా భారత్ మార్కెట్లో ఆవిష్కరిస్తున్నారని సమాచారం. రియల్ మీ జీటీ 6టీ (Realme GT 6T) ఫోన్‌ను ఈ నెల 22 మధ్యాహ్నం 12 గంటలకు భారత్ మార్కెట్లో ఆవిష్కరిస్తారు. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్, రియల్మీ వెబ్‌సైట్‌ల్లో ఈ ఫోన్ విక్రయాలు జరుగుతాయి.
రియల్ మీ జీటీ 6టీ (Realme GT 6T) ఫోన్ గ్లోసీ ఫినిష్‌తోపాటు సిల్వర్ కలర్ ఆప్షన్లో వస్తుంది. డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, థర్డ్ సర్క్యులర్ ఐలాండ్ మీద డ్యుయల్ ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్స్, రైట్ ఎడ్జ్ మీద పవర్ బటన్లు, వాల్యూమ్ రాకర్లు, బాటం ఎడ్జిపై స్పీకర్ గ్రిల్లె, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ తదితర ఫీచర్లు ఉంటాయి.
రియల్ మీ జీటీ 6టీ (Realme GT 6T) ఫోన్ ధర రూ.31,999 పలుకుతుందని భావిస్తున్నారు. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 3 ఎస్వోసీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 100వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో 6.78 అంగుళాల 1.5 కే రిజొల్యూషన్ తో 8టీ ఎల్టీపీఓ ఓలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది.
ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఓఎస్ మీద పని చేసే ఈ ఫోన్.. ఐపీ65 రేటింగ్ ఫర్ డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. 50-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్882 సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 8-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్355 సెన్సర్ విత్ ఆల్ట్రావైడ్ లెన్స్, 32-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 615 సెన్సర్ కెమెరాతో వస్తున్నదీ ఫోన్. వై-ఫై 6, బ్లూ టూత్ 5.3, ఎన్ఎఫ్సీ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 12 జీబీ ర్యామ్ కెపాసిటీతో వస్తుందని భావిస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కరువు ముప్పుపై సర్కారు నిర్లక్ష్యం : చాడ కిషన్‌రెడ్డి
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

