Supriya Sule | ఈవీఎంలు భద్రపరిచే చోట సీసీటీవీలు ఆపేశారు.. ఏదో తప్పు జరిగింది: సుప్రియా సూలే
Supriya Sule | ఈవీఎంలు భద్రపరిచిన గోదాంలో 45 నిమిషాలపాటు సీసీటీవీలు ఆపేశారని ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ కుమార్తె, బారామతి లోక్‌సభ అభ్యర్థి సుప్రియా సూలే ఆరోపించారు. లోపల ఏదో తప్పు జరిగిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
ముంబై: ఈవీఎంలు భద్రపరిచిన గోదాంలో 45 నిమిషాలపాటు సీసీటీవీలు ఆపేశారని ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ కుమార్తె, బారామతి లోక్‌సభ అభ్యర్థి సుప్రియా సూలే (Supriya Sule) ఆరోపించారు. లోపల ఏదో తప్పు జరిగిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ రెబల్ నేత అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ బీజేపీ అభ్యర్థిగా సుప్రియా సూలేపై పోటీ చేసింది. మే 7న మూడో దశ పోలింగ్‌లో భాగంగా బారామతితోపాటు ఇతర నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. నాటి నుంచి ఈవీఎంలను బారామతిలోని ఎఫ్‌సీఐ గోదాంలో భద్రపరిచారు.
కాగా, గోదాం లోపల భద్రపరిచిన ఈవీఎంల పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన సీసీటీవీలు సోమవారం ఉదయం 10.30 నుంచి 11.15 వరకు సుమారు 45 నిమిషాలపాటు ఆఫ్ అయ్యాయని సుప్రియా సూలే తెలిపారు. అక్కడ ఉన్న తమ సిబ్బంది ఎన్నికల అధికారులు, పోలీసుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈవీఎంలను భద్రపరిచిన గోదాం లోపల ఏదో తప్పు జరిగి ఉంటుందని సుప్రియా సూలే అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ ద్వారా ఆందోళన వ్యక్తం చేశారు. సీసీటీవీలు ఆఫ్ అయిన వీడియో క్లిప్ కూడా ఆమె షేర్ చేశారు.
बारामती लोकसभा मतदारसंघाचे मतदान पार पडल्यानंतर त्या इव्हिएम ज्या गोडावूनमध्ये ठेवल्या आहेत, तेथील सीसीटिव्ही आज सकाळी ४५ मिनिटे बंद पडले होते. इव्हिएमसारखी अतिशय महत्वाची गोष्ट जेथे ठेवलेली आहे, तेथील सीसीटिव्ही बंद पडणे ही बाब संशयास्पद आहे. तसेच हा खुप मोठा हलगर्जीपणा देखील… pic.twitter.com/8HmqR2icHn
— Supriya Sule (@supriya_sule) May 13, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

