Dhanush | చెన్నైలో సౌతిండియా ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (నడిగర్ సంఘం) కొత్త భవన నిర్మాణానికి లెజెండరీ యాక్టర్లు రజినీకాంత్, కమల్ హాసన్ 2017లో శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే Nadikar Sangam భవన నిర్మాణం కోసం తలైవా, కమల్ హాసన్ రూ.కోటి చొప్పున విరాళంగా అందించారు. తాజాగా మరో స్టార్ యాక్టర్ ధనుష్ (Dhanush) కూడా నడిగర్ సంఘం నిర్మాణంలో తన వంతు పాత్ర పోషించేందుకు ముందుకొచ్చాడు.
భవన నిర్మాణం కోసం కోటి విరాళంగా ప్రకటించాడు ధనుష్. ఈ మేరకు నటులు నాజర్, కార్తీ (karthi)కి విరాళాన్ని అందజేశాడు. కార్తీ, ధనుష్ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తున్న స్టిల్ ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. ధనుష్, కార్తీ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానులను ఎంటర్టైన్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. తెలుగు, తమిళ భాషల్లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ ఇద్దరినీ ఒకే ఫ్రేమ్‌లో చూసి సంబరపడిపోతున్నారు అభిమానులు.
ఒకే ఫ్రేమ్‌లో..
South Indian Actor Sangam Member – Actor @DhanushKraja donated Rs 1 Crore from his personal funds for the construction of the Actor Sangam building 🏫 #Dhanush #Karthi #Raayan #Kubera pic.twitter.com/hiRyErmloN
— Movie Tamil (@MovieTamil4) May 13, 2024