చెన్నై: ప్రపంచంలో తొలి మల్టీనేషనల్ యూనివర్సిటీగా ఎదిగేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), మద్రాస్ ప్రయత్నిస్తున్నది. ఈ వ్యూహంలో భాగంగా ఐఐటీఎం గ్లోబల్ అనే ఇంటర్నేషనల్ రిసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ప్లాట్‌ఫాంను శుక్రవారం ప్రారంభించింది.
దీనిని విదేశాంగ మంత్రి జైశంకర్ చెన్నై క్యాంపస్‌లో ప్రారంభించారు. విదేశాల్లో పరిశోధనలు, అకడమిక్, స్టార్టప్ కొలాబరేషన్లను విస్తరించాలనే విస్తృత వ్యూహంలో భాగంగా ఐఐటీఎం గ్లోబల్‌ను ప్రారంభించారు. దీని ద్వారా పరిశోధన, ప్రతిభ, పరిశ్రమలు, స్టార్టప్‌లలో పరస్పర సహకారాన్ని ప్రోత్సహిస్తారు. భారత దేశ దేశీయ వ్యవస్థలోకి గ్లోబల్ ప్రాజెక్టులు, పెట్టుబడులను తిరిగి తీసుకొస్తారు.