న్యూఢిల్లీ: ప్రజలకు న్యాయ సహాయాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం న్యాయ సేతు సేవలను వాట్సాప్‌లో గురువారం అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ మెసేజ్ ద్వారా న్యాయ సేతు నుంచి ఉచితంగా న్యాయ సేవలను పొందవచ్చునని కేంద్ర న్యాయ శాఖ తెలిపింది. ఈ అప్డేట్ వల్ల ప్రతి పౌరునికి వృత్తిపరమైన న్యాయ సహాయం ఎల్లప్పుడూ వేగంగా, అందుబాటులో ఉంటుందని తెలిపింది.
న్యాయ సేతు యాప్‌ను భారత ప్రభుత్వం 2024 ఆగస్టులో ప్రారంభించింది. ప్రజలకు న్యాయ సహాయం మరింత మెరుగ్గా అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో దీనిని తీసుకొచ్చింది. సంక్లిష్టమైన బ్యూరోక్రాటిక్ ప్రాసెస్ల ద్వారా అన్వేషించవలసిన అవసరం లేకుండా, ప్రజలు వేగంగా మార్గదర్శకత్వాన్ని పొందే విధంగా దీనిని తీర్చిదిద్దారు. 7217711814 నంబర్‌కు మెసేజ్ చేసి సేవలు పొందొచ్చు.