అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓటమి పాలవుతున్నామన్న భయంతో అధికార వైసీపీ శ్రేణులు టీడీపీ నాయకులపై దాడులకు పాల్పడ్డారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు(Chandrababu) ఆరోపించారు. తాడిపత్రిలో ఏకంగా ఎస్పీ వాహనంపైనే దాడి చేయడం, పోలీసులకుసైతం రక్షణ లేకుండా పోయిందని దుయ్యబట్టారు. ఐదేళ్లుగా పెంచి పోషించిన రౌడీ మూకలు, ఈ ఎన్నికల్లో ప్రజల్లో భయం పుట్టి్ంచి పోలింగ్(Polling) శాతాన్ని తగ్గించడం ద్వారా లబ్ధి పొందే కుట్ర చేశారని మండిపడ్డారు.
అరాచకాలను నమ్ముకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు. మహిళా ఓటర్లు, మహిళా నేతలపై దాడులు దుర్మార్గమని అన్నారు. మాచర్లలో బ్రహ్మారెడ్డిపై , నరసరావుపేటలో కృష్ణదేవరాయలపై దాడి చేసి కార్లు ధ్వంసం చేశారని పేర్కొన్నారు. తాడిపత్రిలో టీడీపీ నేతలపై పెద్దారెడ్డి, ఆయన కుమారుడు దాడిచేశారని ఆరోపించారు.