Myanmar | మయన్మార్‌ను (Myanmar) శక్తిమంతమైన భూకంపం వణికించిన విషయం తెలిసిందే. రిక్టరు స్కేలుపై 7.7, 6.4 తీవ్రతతో నిమిషాల వ్యవధిలోనే రెండు బలమైన ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ విపత్తులో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. మయన్మార్ భూకంపం మృతుల సంఖ్య 61కి పెరిగింది. దాదాపు 250 మంది గాయపడ్డట్లు స్థానిక మీడియా నివేదించింది.
శుక్రవారం మధ్యాహ్నం సమయంలో సెంట్రల్ మయన్మార్ (Myanmar)లోని మోనివా నగరానికి తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే గుర్తించింది. ఈ భూకంపం ధాటికి మయన్మార్ మొత్తం వణికిపోయింది. రోడ్లు, వంతెనలు, ఎయిర్‌పోర్ట్‌లు ధ్వంసమయ్యాయి. అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ భూకంపం తీవ్రతకు మయన్మార్ రాజధాని నేపిడాలో 1,000 పడకల ఆసుపత్రి ధ్వంసమైంది.
ఇది నగరంలోనే అతిపెద్దదని స్థానిక మీడియా తెలిపింది. ఈ ఘటనతో క్షతగాత్రులకు వీధుల్లోనే చికిత్స అందిస్తున్నారు. అదేవిధంగా మండలేలో ప్రార్థనల సమయంలో ఓ మసీదు కూలిపోయింది. రంగంలోకి దిగిన ఆర్మీ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేసింది. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని వెలికి తీసే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు విపత్తు నేపథ్యంలో మన్మార్లోని ఆరు రాష్ట్రాల్లో ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మరోవైపు థాయ్‌లాండ్‌లో కూడా భూ ప్రకపంనలు నమోదైన విషయం తెలిసిందే. బ్యాంకాక్‌లో 7.3తో భూమి కంపించింది. ఈ భూకంపం ధాటికి ఇప్పటి వరకూ ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 90 మందికిపైగా గల్లంతయ్యారు.
Also Read..
Thailand | థాయ్‌లాండ్‌లో భారీ భూకంపం.. భారతీయుల కోసం హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసిన ఇండియన్ ఎంబసీ
Myanmar | మయన్మార్‌లో 1,000 పడకల ఆసుపత్రి ధ్వంసం.. క్షతగాత్రులకు వీధుల్లోనే చికిత్స
PM Modi | క్లిష్ట పరిస్థితుల్లో అండగా ఉంటాం.. మయన్మార్, థాయ్‌లాండ్‌లో భూకంపంపై మోదీ ట్వీట్