Thailand | మయన్మార్‌ను (Myanmar) శక్తిమంతమైన భూకంపం వణికించిన విషయం తెలిసిందే. రిక్టరు స్కేలుపై 7.7, 6.4 తీవ్రతతో నిమిషాల వ్యవధిలోనే రెండు భూకంపాలు వచ్చాయి. ఈ భూకంపం ధాటికి.. థాయ్‌లాండ్‌లోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. థాయ్ రాజధాని బ్యాంకాక్ (Bangkok)లో 7.3 తీవ్రతతో బలమైన ప్రకంపనలు సంభవించాయి. దీంతో వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. పలు భవనాలకు పగుళ్లు రావడంతో అధికారులు మూసివేశారు. అప్రమత్తమైన థాయ్ ప్రభుత్వం బ్యాంకాక్ (Bangkok)లో అత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించింది.
విపత్తు నేపథ్యంలో బ్యాంకాక్‌లోని భారత రాయబార కార్యాలయం అప్రమత్తమైంది. ఈ మేరకు థాయ్‌లాండ్‌లోని భారతీయుల సహాయార్థం హెల్స్‌లైన్ ఏర్పాటు చేసింది. బాధితుల కోసం +66 618819218 నంబర్‌ను జారీ చేసింది. అత్యవసర పరిస్థితుల్లో ఈ నంబర్‌ను సంప్రదించాలని సూచించింది. థాయ్ అధికారుల సమన్వయంతో దేశంలోని తాజా పరిస్థితిని ఇండియన్ ఎంబసీ నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. తాజా విపత్తులో ఏ భారతీయ పౌరుడు ప్రాణాలు కోల్పోయినట్లుగానీ, గాయపడినట్లు గానీ నివేదికలు లేవని వెల్లడించింది. అదేవిధంగా బ్యాంకాక్‌లోని భారత రాయబార కార్యాలయం, చియాంగ్ మాయిలోని కాన్పులేట్ సభ్యులందరూ సురక్షితంగా ఉన్నట్లు తెలిపింది.
The Embassy of India, Bangkok, issues an emergency number, +66 618819218, for Indian nationals in Thailand, which they can use in case of any emergency.
“After powerful earthquake tremors recorded in Bangkok and in other parts of Thailand, the Embassy is closely monitoring the… pic.twitter.com/neA2YJtVz8
— ANI (@ANI) March 28, 2025
ఇదిలా ఉండగా.. థాయ్‌లాండ్‌లో భూకంపం ధాటికి ఎత్తైన భవనాలు నేలకూలాయి. రోడ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. అప్రమత్తమైన అధికారులు అనేక భవనాలను ఖాళీ చేయించారు. వ్యాపార సముదాయాలను మూసివేయించారు. బ్యాంకాక్‌లో మెట్రో, రైలు సేవలు కూడా నిలిచిపోయాయి. ఈ విపత్తులో ఇప్పటి వరకూ ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడినట్లు స్థానిక మీడియా పేర్కొంది. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించినట్లు తెలుస్తోంది.
Also Read..
Myanmar | మయన్మార్‌లో 1,000 పడకల ఆసుపత్రి ధ్వంసం.. క్షతగాత్రులకు వీధుల్లోనే చికిత్స
PM Modi | క్లిష్ట పరిస్థితుల్లో అండగా ఉంటాం.. మయన్మార్, థాయ్‌లాండ్‌లో భూకంపంపై మోదీ ట్వీట్
Earthquake | భూకంపం ధాటికి బ్యాంకాక్‌లో ఎమర్జెన్సీ విధింపు.. నగరాన్ని వీడుతున్న వేలాది మంది