Age Reversal | 18 ఏళ్ల యువకుడిలా కనబడేందుకు తాపత్రయం.. ఏటా 16 కోట్లు ఖర్చుపెడుతున్న బిలియనీర్
Age Reversal | అమెరికాకు చెందిన 45 ఏళ్ల ఓ వ్యాపారవేత్త మాత్రం 18 ఏళ్ల యువకుడిగా మారిపోవాలని తాపత్రాయపడుతున్నాడు. దీనికోసం అమెరికాకు చెందిన ఓ పెద్ద బిజినెస్‌మ్యాన్ ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. దీనికోసం ఏటా కోట్లకు కోట్లు ఖర్చుపెడుతున్నాడు.
Age Reversal | రోజులు గడిచేకొద్ది వయసు పెరుగుతుంది. ఏళ్లు గడిచేకొద్ది ముసలివాళ్లం అవుతుంటాం. కానీ ముసలితనం నుంచి యవ్వనంలోకి రావడం సాధ్యమేనా? వయసును వెనక్కి తీసుకురావడం ఇప్పుడైతే సాధ్యం కాదు.. కానీ భవిష్యత్తులో మాత్రం చెప్పలేం. ఎందుకంటే రివర్స్ ఏజింగ్‌పై ఇప్పటికే శాస్త్రవేత్తలు పలు అధ్యయనాలు చేస్తున్నారు. ఆ పరిశోధనల సంగతి ఏమో కానీ అమెరికాకు చెందిన 45 ఏళ్ల ఓ వ్యాపారవేత్త మాత్రం 18 ఏళ్ల యువకుడిగా మారిపోవాలని తాపత్రాయపడుతున్నాడు. దీనికోసం అమెరికాకు చెందిన ఓ పెద్ద బిజినెస్‌మ్యాన్ ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. దీనికోసం ఏటా కోట్లకు కోట్లు ఖర్చుపెడుతున్నాడు.
18 ఏళ్ల యువకుడిగా మారేందుకు కష్టపడుతున్న ఆ బిజినెస్‌మ్యాన్ పేరు బ్రయాస్ జాన్సన్. బయోటెక్ కంపెనీకి సీఈవో. బ్రయాస్కు దీర్ఘాయువు, వృద్ధాప్యం రాకుండా నిత్య యవ్వనంగా ఉండటం వంటి అంశాల మీద ఆసక్తి ఎక్కువ. అందుకే తన వయసు తగ్గించుకునే ప్రయోగానికి సుముఖత చూపించాడు. ఓలివర్ జోల్మాన్ ( 29 ) అనే వైద్యుడిని పర్యవేక్షణలో తన వయస్సును తగ్గించుకునేందుకు రకరకాల చికిత్సలు తీసుకుంటున్నాడు. ఇందుకోసం జోల్మాన్తో పాటు మరో 30 మంది ఆరోగ్య నిపుణులు బ్రయాస్ జాన్సన్ వెన్నంటే ఉండి ఆయన్ను పర్యవేక్షిస్తున్నారు.
2 yrs of Blueprint:
.5.1 yrs epigenetic age reversal (world record)
.slowed my pace of aging by 24%
.perfect muscle & fat (MRI)
.50+ perfect biomarkers
.100+ markers < chronological age
.fitness tests = 18yr old
.Body runs 3F° coolerAvailable to all: https://t.co/Ye5mQPH9NH
— Bryan Johnson (@bryan_johnson) January 18, 2023
నిజానికి ఇలాంటి ప్రయోగాలను ముందుగా గినియా పందులపై చేస్తుంటారు. కానీ బ్రయాస్ మాత్రం నేరుగా ఈ ప్రయోగాలను తన మీదనే చేయించుకుంటున్నాడు. ఇందుకోసం కాలిఫోర్నియా వెనిస్లోని తన ఇంటిని ఒక ల్యాబరేటరీగా మార్చుకున్నాడు. 30 మందికి పైగా వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాడు. రోజూ ఎక్సర్సైజ్లు చేయడంతో పాటు, డైట్ విషయంలోనూ వాళ్లు చెప్పిన జాగ్రత్తలనే పాటిస్తున్నాడు. బ్లడ్ టెస్ట్, ఎంఆర్ఐ, కొలనోస్కొపిస్ వంటి పరీక్షలను నెల నెలా చేయించుకుంటున్నాడు కూడా.
ఇలా ఈ ప్రయోగం కోసం బ్రయాస్ ఏటా 16 కోట్ల రూపాయలు ( 2 మిలియన్ డాలర్లు ) ఖర్చు చేస్తున్నాడు. ఇంత ఖర్చు పెట్టి చేస్తున్న ప్రయోగం ద్వారా ఏజ్ రివర్సింగ్ సాధ్యమవుతుందని వైద్యులు చెప్పినట్టుగా బ్లూమ్‌బర్గ్ నివేదికలో వెల్లడైంది. 2021 నాటికి జన్యుపరంగా బ్రయాస్ వయసు 5.1 ఏళ్లు తగ్గిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం బ్రయాస్ జాన్సన్ వయసు 45 ఏళ్లు అయినప్పటికీ ఆయన గుండె 37 ఏళ్ల వ్యక్తికి ఉన్నంత ఆరోగ్యంగా ఉందని పేర్కొన్నారు. ఇక చర్మం 28 ఏళ్ల వ్యక్తిలాగా, ఊపిరితిత్తుల సామర్థ్యం 18 ఏళ్ల యువకుడికి ఉన్నట్టుగానే ఉందని చెప్పాడు. వాస్తవానికి ఈ ప్రయోగం అంత సురక్షితమైనది ఏమీ కాదు.. పందుల మీద చేయాల్సిన ప్రయోగాలను బ్రయాస్ తనపై చేయించుకుంటున్నాడు. ఇంత రిస్క్ చేయడంపై బ్రయాన్ స్పందిస్తూ.. తన ప్రాణాలకు ముప్పు ఏర్పడినా ఫర్వాలేదు.. కానీ ఈ ప్రయోగం విజయవంతం అయితే నిత్య యవ్వనంగా కనిపించాలన్న మనిషి కోరిక నెరవేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
Read More :
selfie | మెడలో పాముతో సెల్ఫీకి ఫోజు.. బెడిసికొట్టడంతో ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు
డిజిటల్ కరెన్సీతో దానిమ్మ పండ్లు కొన్న ఆనంద్ మహీంద్రా.. వీడియో వైరల్
వామ్మో.. బాలకృష్ణ సినిమాను తలపిస్తున్నదిగా ఈ బకెట్ యాడ్..!!
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

