న్యూఢిల్లీ : వినూత్న మార్కెటింగ్ ఆలోచనతో ప్రోడక్ట్‌ను అమ్ముకోవడం ఏమంత సులభం కాదు. ఇతర బ్రాండ్ల నుంచి ఎదురయ్యే పోటీని అధిగమించాలంటే భిన్నమైన ఐడియాతో ప్రకటనలు రూపొందించి కస్టమర్లను ఆకట్టుకోవాలి.
यकीन मानें, ये बांगलादेशी बाल्टी का विज्ञापन है.😂 pic.twitter.com/AMML2sezOY
— Dipanshu Kabra (@ipskabra) January 25, 2023
బంగ్లాదేశీ ప్లాస్టిక్ బ్రాండ్ ఆర్ఎఫ్ఎల్ బకెట్ ఇన్నోవేటివ్ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐపీఎస్ అధికారి దీపాన్షు కాబ్ర ఈ క్లిప్‌ను ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ వీడియోలో హీరో సదరు కంపెనీకి చెందిన రెడ్ బకెట్ ధరించి విలన్ గ్యాంగ్‌పై విరుచుకుపడటం కనిపిస్తుంది. వీడియో చివరిలో యుద్ధరంగం నుంచి హీరో బయటకు వస్తూ తన బకెట్ వెపన్‌కు థ్యాంక్స్ చెబుతాడు.
ప్రోడక్ట్ గురించిన వివరాలతో యాడ్ ముగుస్తుంది. బకెట్ పేరు యూనిక్ కాగా, అత్యంత ధృడమైన బకెట్ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి 30,000కు పైగా వ్యూస్ రాబట్టగా పెద్దసంఖ్యలో యూజర్లు రియాక్ట్ అయ్యారు.