Earthquake | ఇరాన్ (Iran)లో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. ఈశాన్య నగరమైన కష్మార్ (Kashmar)లో మంగళవారం మధ్యాహ్నం 1:24 గంటలకు భూమి కంపించింది. భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 4.9గా నమోదైనట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ భూకంపం ధాటికి కనీసం నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. సుమారు 120 మందికి గాయాలైనట్లు రాష్ట్ర మీడియా నివేదించింది.
భూమికి 10 కిలోమీటర్ల (ఆరు మైళ్లు) లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంపం ధాటికి భారీ భవనాలు నేలమట్టమయ్యాయి. పలు భవనాలు దెబ్బతిన్నట్లు కష్మార్ గవర్నర్ హజతుల్లా షరియత్మదారి (Hajatollah Shariatmadari) ప్రకటించారు. రోడ్లు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించారు.
ఇరాన్ వివిధ టెక్టోనిక్ ప్లేట్లలో ఉండగా, ఇక్కడ తరచుగా భూకంపాలు (earthquake) సంభవిస్తుంటాయి. గతేడాది ప్రారంభంలో కూడా టర్కీ సరిహద్దుకు సమీపంలో ఇరాన్ వాయువ్య పర్వత ప్రాంతంలో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. సుమారు 800 మందికి పైగా గాయపడ్డారు. అదేవిధంగా అత్యంత భయంకరమైన భూకంపం 2003లో ఇరాన్లో సంభవించింది. ఆగ్నేయ ఇరాన్‌లోని బామ్‌లో 6.6 తీవ్రతతో సంభవించగా, భూకంపం ధాటికి 31,000 మందికి పైగా మరణించారు.
Also Read..
North Korea: పుతిన్‌కు రెడ్‌కార్పెట్.. గ్రాండ్ వెల్కమ్ పలికిన కిమ్
STSS | జపాన్ను వణికిస్తున్న మరో మహమ్మారి.. 48 గంటల్లో మనిషిని చంపేస్తుందట..!
5 లక్షల మందికి అమెరికా పౌరసత్వం!