5 లక్షల మందికి అమెరికా పౌరసత్వం!
అమెరికాలో చట్టబద్ధమైన హోదా లేని లక్షలాది మంది వలసదారులకు ఉపశమనం కల్పిస్తూ ఆ దేశ అధ్యక్షుడు బైడెన్ కీలక ప్రకటన చేశారు.
- వలసదారులకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారీ ఉపశమనం
- వేలాదిమంది భారతీయులకు లబ్ధి
వాషింగ్టన్, జూన్ 18: అమెరికాలో చట్టబద్ధమైన హోదా లేని లక్షలాది మంది వలసదారులకు ఉపశమనం కల్పిస్తూ ఆ దేశ అధ్యక్షుడు బైడెన్ కీలక ప్రకటన చేశారు. అమెరికా పౌరుల విదేశీ జీవిత భాగస్వాములు, వారి పిల్లలకు దేశ పౌరసత్వం కల్పించనున్నట్టు వెల్లడించారు. దాదాపు 5 లక్షల మందికి ఈ నిర్ణయం ద్వారా ప్రయో జనం చేకూరనున్నట్టు అంచనా. వేలాది మంది భారతీయులకు కూడా ఇది లబ్ధి చేకూర్చనున్నది. విదేశీ జీవిత భాగస్వాములు కలిగిన అమెరికా పౌరులు, వారి పిల్లలు కలిసి ఉండేలా చర్యలు తీసుకోవాని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగానికి బైడెన్ ఆదేశాలు జారీచేశారు. లీగల్ స్టేటస్ లేకుండా ఉంటున్న అమెరికా పౌరుల జీవిత భాగస్వామ్యులకు శాశ్వత నివాసానికి, పౌరసత్వానికి దరఖాస్తు చేసుకొనే అవకాశం ప్రభుత్వం కల్పించనున్నదని వైట్‌హౌస్ ప్రకటించింది. బైడెన్ కొత్త ప్రణాళిక ప్రకారం వేలాది మంది భారత సంతతి అమెరికన్లతో సహా దాదాపు 5 లక్షల మంది వలసదారులు అమెరికా పౌరసత్వం పొందుతారని వైట్‌హౌస్ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. దరఖాస్తు చేసేందుకు అర్హత పొందాలంటే, ఒక వలసదారు సోమవారం నాటికి అమెరికాలో 10 ఏండ్లు నివాసం ఉండటంతోపాటు అమెరికా పౌరుడిని వివాహం చేసుకొని ఉండాలి. క్వాలిఫై అయిన వలసదారు దరఖాస్తు ఆమోదం తర్వాత.. అతను లేదా ఆమె గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకొనేందుకు, తాత్కాలిక వర్క్ పర్మిట్ పొందేందుకు, బహిష్కరణ నుంచి రక్షణ పొందేందుకు మూడేండ్ల సమయం ఉంటుందని అధికారిక వర్గాలు తెలిపాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పురాతన ఆలయ గోపురం ధ్వంసం.. సుదర్శన చక్రం చోరీకి యత్నం?
‘గీత కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చాలి’
Ram Charan | రామ్ చరణ్ కీలక నిర్ణయం.. బాలీవుడ్ దర్శకుడికి నో చెప్పారా?
‘రైతులకు 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ అందించాలి’
Nic Maddinson | క్యాన్సర్‌ను జయించి 9 ఏళ్లకు పునరాగమనం.. 33 బంతులాడి డకౌట్..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

