STSS | జపాన్ను వణికిస్తున్న మరో మహమ్మారి.. 48 గంటల్లో మనిషిని చంపేస్తుందట..!
STSS | కొవిడ్ మహమ్మారి నుంచి బయటపడకముందే మరో మహమ్మారి పుట్టుకొచ్చింది. అది కేవలం 48 గంటల్లో మనిషిని చంపేస్తుందట. ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తాజాగా జపాన్‌లో వెలుగులోకి వచ్చింది.
STSS | టోక్యో, జూన్ 18: కొవిడ్ మహమ్మారి నుంచి బయటపడకముందే మరో మహమ్మారి పుట్టుకొచ్చింది. అది కేవలం 48 గంటల్లో మనిషిని చంపేస్తుందట. ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తాజాగా జపాన్‌లో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ బ్యాక్టీరియా బారినపడ్డ కేసులు వెయ్యి దాటాయి. ఈ ప్రాణాంతక ఇన్ఫెక్షన్ను స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ ( ఎస్టీఎస్ఎస్) అంటారు. ఈ ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తికి ఉదయాన్నే పాదాల వాపు వస్తే, అది మధ్యాహ్నానికి మోకాలి ప్రాంతానికి చేరుకుంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఈ ఇన్ఫెక్షన్ను ఐరోపాలోని మరో ఐదు దేశాలలో కూడా గుర్తించారు. ఈ ఏడాది జపాన్‌లో 2,500 కొత్త కేసులు నమోదు కాగా, వారిలో 30 శాతం మంది మరణించారని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
లక్షణాలు: చేతులు, కాళ్లలో నొప్పి, వాపు, జ్వరం, రక్తపోటు మొదలైనవి. ఇన్ఫెక్షన్ పెరిగేకొద్దీ శ్వాసకోశ సమస్యలు వస్తాయి. చివరికి మరణం సంభవిస్తుంది. 50 ఏండ్ల వయసున్న వారు ఎక్కువగా దీని ప్రభావానికి గురవుతున్నారు. ఈ బ్యాక్టీరియా ప్రజల పేగులలో పేరుకుపోతున్నది.
చికిత్స: ప్రజలు పరిశుభ్రత పాటించాలి. గాయాలకు వీలైనంత త్వరగా చికిత్స చేయాలి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

