Earthquake | భారత్ చేపట్టిన ప్రతీకార దాడులతో అల్లాడిపోయిన పొరుగు దేశం పాకిస్థాన్ (Pakistan)ను వరుస భూకంపాలు (Earthquake) వణికిస్తున్నాయి. శనివారం ఉదయం పాక్‌లో భూ ప్రకంపనలు నమోదైన విషయం తెలిసిందే. మూడు రోజుల వ్యవధిలోనే తాజాగా మరోసారి అక్కడ భూమి కంపించింది.
సోమవారం మధ్యాహ్నం 1:26 గంటల సమయంలో భూమి ఒక్కసారిగా కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 4.6గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Centre for Seismology) వెల్లడించింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. ఈ భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు.
అంతకుముందు శనివారం తెల్లవారుజామున 01.44 గంటలకు పాకిస్థాన్‌లో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. రిక్టర్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 4.0గా నమోదైంది. ఇటీవల పాక్‌లో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. పాక్ యురేషియన్, ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్లు కలిసే ప్రదేశంలో ఉంది. దాంతో తరచుగా అక్కడ భూకంపాలు వస్తుంటాయి. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తున్ఖ్వా, గిల్గిట్-బాల్టిస్థాన్ తదితర ప్రాంతాలు యురేషియన్ ప్లేట్ దక్షిణ అంచున ఉండడం వల్ల భూకంపాల బారినపడుతున్నాయి.
Also Read..
India-Pakistan | భారత్-పాక్ మధ్య కీలక చర్చలు వాయిదా..!
PM Modi | భారత్-పాక్ చర్చల వేళ.. అజిత్ దోవల్‌తో ప్రధాని మోదీ కీలక భేటీ