బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Jul 10, 2020 , 16:37:27

నాగాలాండ్‌లో 36 కొత్త కరోనా కేసులు

నాగాలాండ్‌లో 36 కొత్త కరోనా కేసులు

నాగాలాండ్‌ : కరోనా వైరస్‌ వ్యాప్తితో ప్రపంచం మొత్తం వణికిపోతుంది. ఇటు భారతదేశంలో కూడా కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. తాజాగా నాగాలాండ్‌లో 36 కొత్త కరోనా కేసులు నిర్ధారణయ్యాయి. వాటిలో పెరెన్లో 19, డిమాపూర్లో 11, కొహిమాలో 6 కేసులు పాజిటివ్‌గా నమోదైయ్యాయని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో నాగాలాండ్‌లో మొత్తం కేసుల సంఖ్య 732కు చేరింది.

కాగా భారత్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,93,802 చేరి ఎనిమిది లక్షలకు చేరువలో ఉంది. వీటిలో 2,76,682 మంది కరోనా బారినపడి చికిత్స పొందుతుండగా.. 4,95,516 మంది కరోనా నుంచి కోలుకొని రికవరీ అయ్యారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo