US Shutdown | అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్ (US Shutdown) అయి నేటికి సరిగ్గా నెలరోజులైంది. సేనేట్‌లో రిపబ్లికన్లు ప్రవేశపెట్టిన ఫెడరల్ నిధులకు చెందిన బిల్లుకు (funding bill) ఆమోదం దక్కకపోవడంతో అక్టోబర్ 1న అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్ ప్రకటించింది. ఈ షట్‌డౌన్ కారణంగా అగ్రరాజ్యంలో ఆర్థిక సంక్షోభం తలెత్తింది. అక్టోబర్ 1 నుంచి ఇప్పటి వరకూ దాదాపు 7 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ గణాంకాలు చెబుతున్నాయి.
ఈ ప్రతిష్ఠంభణ మరింత ఎక్కువ కాలం కొనసాగితే అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వారం కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ విడుదల చేసిన తాజా అంచనాల ప్రకారం.. ఈ షట్‌డౌన్ కారణంగా ఇప్పటికే 7 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. ఇలాగే కొనసాగితే ఆర్థిక నష్టం మరింత పెరుగుతుంది. షట్‌డౌన్ ఆరు వారాలు కొనసాగితే నష్టం 11 బిలియన్ డాలర్లకు, 8 వారాలు కొనసాగితే 14 బిలియన్ డాలర్లకు చేరుకునే ప్రమాదం ఉంది. మరోవైపు ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ దుర్బలంగా ఉందని, ప్రభుత్వ షట్‌డౌన్ ప్రజలు అనుకున్న దానికంటే చాలా వేగంగా పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉందని మూడీస్ అనలిటిక్స్ చీఫ్ ఎనకామినస్ట్ మార్క్ జాండి హెచ్చరించారు.
సేనేట్‌లో రిపబ్లికన్లు ప్రవేశపెట్టిన ఫెడరల్ నిధులకు చెందిన బిల్లుకు ఆమోదం దక్కకపోవడంతో అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్ ప్రకటించింది. అమెరికా కాలమానం ప్రకారం సెప్టెంబర్ 30, అర్ధరాత్రి (11:59 నిమిషాలు) వరకు ఆ బిల్లు క్లియరెన్స్ కోసం ఎదురుచూశారు. కానీ డెమోక్రాట్లు తగ్గకపోవడంతో.. ట్రంప్ సర్కారు షట్‌డౌన్ ప్రకటించింది. సేనేట్‌లో రిపబ్లికన్లకు కంట్రోల్ ఉన్నా.. బిల్లును పాస్ చేయించుకోలేకపోయారు. ఫండింగ్ బిల్లు సేనేట్‌లో పాస్ కాకపోవడం వల్ల నిరవధికంగా ప్రభుత్వ షట్‌డౌన్ ప్రకటిస్తున్నట్లు వైట్‌హౌజ్ పేర్కొన్నది. గడిచిన ఏడేళ్లలో ఇలా జరగడం ఇదే మొదటిసారి.
Also Read..
ఏఐలకే తోపు ఏజెంటిక్ ఏఐ.. కృత్రిమ మేధ రంగంలో అడ్వాన్స్డ్ వెర్షన్
ఉషకు మతం మారే యోచన లేదు : జేడీ వాన్స్
రాయల్ టైటిల్ కోల్పోయిన ప్రిన్స్ ఆండ్రూ