న్యూఢిల్లీ : దివంగత అమెరికన్ ఫైనాన్షియర్, అత్యాచార నేరగాడు జెఫ్రీ ఎప్స్టీన్తో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తన తమ్ముడు ప్రిన్స్ ఆండ్రూని అన్ని రాచరిక హోదాలు, గౌరవాల నుంచి బ్రిటన్ రాజు చార్లెస్-3 తప్పించినట్లు బకింగ్‌హామ్ ప్యాలెస్ గురువారం ప్రకటించింది. అంతేగాక ఆండ్రూ విండ్సర్లోని తన విలాసవంతమైన భవనం రాయల్ లాడ్జీని కూడా ఖాళీ చేయాలని కింగ్ చార్లెస్ ఆదేశించారు.
మానవ అక్రమ రవాణా, మైనర్లపై లైంగిక దాడి వంటి తీవ్రమైన అభియోగాలను ఎదుర్కొన్న ఇప్స్టీన్తో ఆండ్రూ పేరు ముడిపడి ఉండడాన్ని ప్యాలెస్ తీవ్రంగా పరిగణిస్తోంది. తనకు 17 ఏళ్ల వయసున్నప్పుడు 2001లో ఆండ్రూ తనపై లైంగిక దాడి జరిపినట్లు వర్జీనియా గిఫ్రే అనే బాధితురాలు చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి.