ఏఐలకే తోపు ఏజెంటిక్ ఏఐ.. కృత్రిమ మేధ రంగంలో అడ్వాన్స్డ్ వెర్షన్
సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ(ఏఐ)ది కీలక స్థానం. ఏఐ ప్రవేశంతో ఐటీ, ఐటీఈఎస్, బ్యాంకింగ్, హెల్త్‌కేర్ తదితర రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకొంటున్నాయి. ఏఐతో ఉద్యోగాల కోత ఉందన్న విషయాన్ని పక్కనబెడితే, దాని ద్వారా చేకూరుతున్న ప్రయోజనాలు చాలా ఎక్కువే. ఏఐ రంగంలో ఇప్పటికే చాట్‌జీపీటీ, గ్రోక్, జెమినీ, డీప్‌సీక్ వంటి ప్లాట్‌ఫామ్‌లు మంచి ఆదరణను చూరగొన్నాయి.
- చాట్‌జీపీటీ, గ్రోక్ ఏఐలను తలదన్నే ఫీచర్లు
- మానవ ప్రమేయం లేకపోయినా నిర్ణయాలు తీసుకొనే సామర్థ్యం
- ఆర్థిక సేవలు, హెల్త్‌కేర్ రంగాల్లో ఇప్పటికే విరివిగా ఉపయోగం
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ) : సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ(AI)ది కీలక స్థానం. ఏఐ ప్రవేశంతో ఐటీ, ఐటీఈఎస్, బ్యాంకింగ్, హెల్త్‌కేర్ తదితర రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకొంటున్నాయి. ఏఐతో ఉద్యోగాల కోత ఉందన్న విషయాన్ని పక్కనబెడితే, దాని ద్వారా చేకూరుతున్న ప్రయోజనాలు చాలా ఎక్కువే. ఏఐ రంగంలో ఇప్పటికే చాట్‌జీపీటీ, గ్రోక్, జెమినీ, డీప్‌సీక్ వంటి ప్లాట్‌ఫామ్‌లు మంచి ఆదరణను చూరగొన్నాయి. అయితే, వీటిని తలదన్నే ఫీచర్లతో ఏఐకి అడ్వాన్స్డ్ వెర్షన్‌గా ‘ఏజెంటిక్ ఏఐ’ (Agentic AI) వచ్చింది. మానవ ప్రమేయం అత్యంత తక్కువగా వినియోగించుకొనే ఈ అడ్వాన్స్డ్ ఏఐ.. సొంతంగా నిర్ణయాలను వెలువరించే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంది.
ఏమిటీ ఏజెంటిక్ ఏఐ?
‘ఏజెంటిక్ ఏఐ’ అనే పేరు ‘ఏజెన్సీ’ నుంచి వచ్చింది. ఏజెన్సీలు ఎలాగైతే అప్పగించిన పనులను స్వతంత్రంగా, నిక్కచ్చిగా పూర్తిచేస్తాయో ఈ ఏఐ కూడా అలాగే నిర్వర్తిస్తుంది. మానవ ప్రమేయం అత్యంత తక్కువగా తీసుకొనే ఈ ఏఐ చక్కబెట్టే పనులు 99 శాతం పర్ఫెక్షన్తో ఉన్నట్టు నిపుణులు చెప్తున్నారు.
ఏఐకి.. ఏజెంటిక్ ఏఐకి తేడా ఏమిటీ?
మనం ఏదైనా అంశంపై ప్రశ్న అడిగితే, నెట్‌లోని పలు వెబ్సైట్లు, లార్జ్ లాంగ్వేజ్ మాడల్స్ (LLM) వంటి డాటాబేస్‌లను ఆధారంగా చేసుకొని సాధారణ ఏఐలు సమాధానాలు ఇస్తాయి. అయితే, ఏజెంటిక్ ఏఐ మాత్రం దీనికి భిన్నంగా పనిచేస్తుంది. ఉదాహరణకు.. ఒక హాస్పిటల్ ఓపీలో 50 మంది రోగులు ఉన్నారని అనుకొంటే? వారి రికార్డులను ఏజెంటిక్ ఏఐలో అప్లోడ్ చేసి.. వ్యాధి తీవ్రతను బట్టి రోగులను పంపించాలని ఆదేశాలు ఇస్తే.. ఆ రికార్డులన్నింటినీ అది క్షుణ్ణంగా విశ్లేషిస్తుంది. ఆ తర్వాత వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న రోగులను పంపించడమే కాదు.. వారి ట్రీట్మెంట్కు అవసరమైన ఔషధాలను, భవిష్యత్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా ఏజెంటిక్ ఏఐ వివరిస్తుంది. అంటే ఒకరకంగా ఇది ఓ ఫ్రెండ్లీ ఏజెంట్‌గా వ్యవహరిస్తుంది. మరో ఉదాహరణగా చెప్పాలంటే.. మీ ఫోన్లో ఉదయం 6 గంటలకు నిద్రలేచేందుకు అలారం పెట్టుకొన్నారు. 7 గంటలకు ఆలయంలో జరిగే పూజకు అటెండ్ అవ్వాలని నెల కిందటే రిమైండర్ సెట్ చేసుకొన్నారు. మీ ఇంటి ఈఎంఐ పేమెంట్ సైకిల్ డేట్ అదే రోజు ఉంది. ఆఫీసులో సాయంత్రం కొలిగ్స్‌తో డిన్నర్ ఫిక్స్ అయ్యింది. ఇవన్నీ మనకు రిమైండర్‌గా తెలియాలంటే వేర్వేరు యాప్స్ అవసరం. అయితే, ఒకసారి ఏజెంటిక్ ఏఐకి డైలీ షెడ్యూల్ అంటూ కమాండ్ ఇచ్చారంటే, ఆ రోజు షెడ్యూల్‌ను ముందుగానే ఓ లిస్ట్‌గా తయారుచేసి ఎప్పటికప్పుడు మీకు గుర్తు చేస్తుంది. అలాగే, అంతకుముందు రోజు, ఈ రోజు మీరు ఏ ప్రోగ్రామ్‌కు ఎక్కువ సమయం వెచ్చించారు? దీంతో ఏం ప్రయోజనం చేకూరింది? ఇలా అన్ని విషయాలను స్వతంత్రంగా విశ్లేషించి మీకు రిపోర్ట్ అందిస్తుంది. అంటే ఒక విధంగా మీకు డిజిటల్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తుంది.
ఎక్కడెక్కడ వినియోగిస్తున్నారు?
ఏజెంటిక్ ఏఐ సర్వీసులను ఆర్థిక సేవలు, హెల్త్‌కేర్, సైబర్ సెక్యూరిటీ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ తదితర రంగాల్లో ఇప్పటికే విరివిగా వినియోగిస్తున్నారు. డ్రైవర్ రహిత కార్లు, స్మార్ట్ హోమ్స్, పర్సనల్ అసిస్టెంట్స్లోనూ ఈ ఏఐ సేవలనే కీలకంగా వాడుతున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | ఇక వన్డే సవాల్.. రోకోపైనే అందరి చూపు
Water Shortage | కాలేజీల్లో నీటి కొరత.. క్లాసులు బంద్.. విద్యార్థులను ఇంటికి పంపిన నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలు
SSC Exam Fee | విద్యాశాఖ డొల్లతనం.. టెన్త్ పరీక్ష ఫీజుల ఆన్లైన్ చెల్లింపుల్లో సర్వర్ సమస్య
Bureaucrats | డోంట్‌కేర్ సర్కార్.. ప్రభుత్వం పనైపోయింది, మళ్లీ వచ్చేది లేదు! నిర్ధారణకు వచ్చిన బ్యూరోక్రాట్లు
BC Atma Gaurava Bhavans | బీసీల ‘ఆత్మగౌరవం’పై కాంగ్రెస్ సర్కార్ పెత్తనం.. వేల కోట్ల విలువైన ఆస్తుల హస్తగతానికి గుట్టుగా జీవో!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

