New York | అగ్రరాజ్యం అమెరికా (America) లో మరోసారి తూటా (Shooting) పేలింది. న్యూయార్క్ (New York)లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ (Times Square) వద్ద కాల్పుల కలకలం రేగింది. ఓ దుండగుడు హఠాత్తుగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటన తెల్లవారుజామున 1:20 గంటల సమయంలో (స్థానిక కాలమానం ప్రకారం) చోటు చేసుకుంది.
కాల్పుల ఘటనతో అక్కడి ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అక్కడి నుంచి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, ఈ ఘటనలో ఇప్పటి వరకూ ఎలాంటి అభియోగాలు నమోదు చేయలేదు.
Also Read..
Pakistan | భారత్ విమానాలకు గగనతలం మూసివేత.. రెండు నెలల్లోనే పాక్కు రూ.400 కోట్ల నష్టం
Ajit Doval | రష్యా ఉప ప్రధానితో అజిత్ దోవల్ భేటీ.. మిలిటరీ-సాంకేతిక ఒప్పందాలపై ద్వైపాక్షిక చర్చలు