Benjamin Netanyahu | గాజాను స్వాధీనం చేసుకోవట్లేదు.. హమాస్ నుంచి విముక్తి ప్రసాదిస్తున్నాం : ఇజ్రాయెల్ ప్రధాని
Benjamin Netanyahu | హమాస్‌తో జరుగుతున్న పోరును మరింత తీవ్రతరం చేసి గాజా (Gaza)ను స్వాధీనం చేసుకోవాలన్న ప్రణాళికకు ఇజ్రాయెల్ సెక్యూరిటీ క్యాబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
Benjamin Netanyahu | హమాస్‌తో జరుగుతున్న పోరును మరింత తీవ్రతరం చేసి గాజా (Gaza)ను స్వాధీనం చేసుకోవాలన్న ప్రణాళికకు ఇజ్రాయెల్ సెక్యూరిటీ క్యాబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. హమాస్‌ను ఓడించడానికి గాజాను స్వాధీనం చేసుకోవాలన్న ప్రధాని ప్రతిపాదనను మంత్రివర్గం గురువారం ఆమోదించింది. అయితే, ఇజ్రాయెల్ నిర్ణయంపై వివిధ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకతవ్యక్తమైంది. దీంతో తన నిర్ణయంపై నెతన్యాహు (Benjamin Netanyahu) వివరణ ఇచ్చారు. గాజా నగరానికి సంబంధించిన తన ప్రణాళికను వివరిస్తూ ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. తాము గాజాను ఆక్రమించుకోవడం లేదని.. హమాస్ నుంచి విముక్తి ప్రసాదించనున్నట్లు స్పష్టం చేశారు.
‘మేము గాజాను ఆక్రమించుకోవడం లేదు. హమాస్ నియంత్రణ నుంచి విముక్తి ప్రసాదించనున్నాం. భవిష్యత్తులో అక్కడ ఎలాంటి సైనిక కార్యకలాపాలు జరగకుండా చేయడమే మా ప్రణాళికలో భాగం. శాంతియుత పౌర పరిపాలనను నెలకొల్పడానికి కట్టుబడి ఉన్నాం. పాలస్తీనా, హమాస్ సహా ఇతర ఉగ్రవాద సంస్థలతో కూడిన పరిపాలన ఆ ప్రాంతంలో ఉండదు. ఈ చర్య హమాస్ చెరలో బందీలుగా ఉన్న పౌరులను విడిపించడంలో దోహదపడుతుంది. అలాగే భవిష్యత్తులో గాజా నుంచి ఇజ్రాయెల్‌కు ఎటువంటి భద్రతా ముప్పు రాకుండా చేస్తుంది’ అని నెతన్యాహు ఎక్స్ పోస్టులో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ అవుతోంది.
We are not going to occupy Gaza – we are going to free Gaza from Hamas.
Gaza will be demilitarized, and a peaceful civilian administration will be established, one that is not the Palestinian Authority, not Hamas, and not any other terrorist organization.
This will help free…
— Benjamin Netanyahu – בנימין נתניהו (@netanyahu) August 8, 2025
హమాస్‌తో 22 నెలలుగా సాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు ఐదు అంశాలతో కూడిన ప్రత్యేక ప్రణాళికను ఇజ్రాయెల్ భద్రతా మంత్రివర్గం గురువారం ఆమోదించింది. అయితే, ఈ నిర్ణయాన్ని ప్రపంచ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బ్రిటన్, చైనా, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా, బెల్జియం వంటి అనేక దేశాలు టెల్అవీవ్ నిర్ణయాన్ని ఖండించాయి. టెల్‌అవీవ్‌కు యుద్ధ సామగ్రి సరఫరా చేయబోమని జర్మనీ స్పష్టం చేసింది. దీంతో నెతన్యాహు పైవిధంగా స్పందించారు. గాజాపై తన నిర్ణయాన్ని స్పష్టం చేశారు.
Also Read..
గాజా స్వాధీనానికి ఇజ్రాయెల్ నిర్ణయం
Donald Trump | వచ్చే శుక్రవారం పుతిన్‌తో సమావేశమవుతున్నా.. డొనాల్డ్ ట్రంప్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

