జెరూసలేం : హమాస్‌తో జరుగుతున్న పోరును మరింత తీవ్రతరం చేసి గాజాను స్వాధీనం చేసుకోవాలన్న ప్రణాళికకు ఇజ్రాయెల్ సెక్యూరిటీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ‘హమాస్‌ను ఓడించడానికి గాజాను స్వాధీనం చేసుకోవాలన్న ప్రధాని ప్రతిపాదనను మంత్రివర్గం గురువారం ఆమోదించింది.
ఐడీఎఫ్ గాజా నగరాన్ని స్వాధీనం చేసుకోవడానికి సిద్ధమవుతూనే పోరాట మండలాలకు వెలుపల ఉన్న పౌర సమూహానికి మానవతా సహాయం పంపిణీ చేస్తాయి’ అని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం తెలిపింది.