బుధవారం 03 జూన్ 2020
International - Apr 11, 2020 , 16:20:22

రగులుతున్న అనక్ క్రాకటోవా

రగులుతున్న అనక్ క్రాకటోవా

ఇండోనేషియాలోని జావా ద్వీపంలో ఉన్న అనక్‌ క్రాకటోవా అగ్నిపర్వతం మళ్లీ రగులుతున్నది. శుక్రవారం రాత్రి నుంచి పొగలు, లావాను చిమ్ముతున్నది. ఈ అగ్ని పర్వతం నుంచి వెలువడుతున్న ధూళి మేగాలు 500 మీటర్ల ఎత్తువరకు ఎగసిపడుతున్నాయని ఇండోనేషియా వల్కనాలజీ, జియాలాజికల్‌ డిజాస్టర్‌ మిటిగేషన్‌ అధికారులు శనివారం తెలిపారు. దాంతో అగ్నిపర్వత చుట్టుపక్కల రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేసినట్లు వెల్లడించారు.

భూమిమీద ఉన్న అత్యంత ప్రమాదకరమైన అగ్నిపర్వతాల్లో క్రాకటోవా ఒకటి. 1883లో ఈ అగ్నిపర్వతం బద్దలవటంతో వేల కిలోమీటర్లమే ధూళి మేఘాలు ఏర్పడి భూమిని సూర్యకిరణాలు తాకకుండా అడ్డుకున్నాయి. దాంతో భూమిపై ఉష్ణోగ్రతలు పడిపోయాయి. నాటి పేలుడు ధాటికి అగ్నిపర్వతం ముక్కలుముక్కలై సముద్రంలో మునిగిపోయింది. ఆ తర్వాత కొంతకాలానికి దాని పక్కనే మరో అగ్నిపర్వతం ఏర్పడింది. దీనినే అనక్‌ క్రాకటోవా అంటున్నారు. క్రాకటోవా పిల్ల అని అర్థం. 2018లో ఈ అగ్నిపర్వతం పేలటంతో 430 మంది మరణించారు.   


logo