Prabhas | మంచు విష్ణు టైటిల్ రోల్‌ని పోషిస్తున్న భక్తిరస చిత్రం ‘కన్నప్ప’ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. ఈ సినిమాలో అక్షయ్‌కుమార్, మోహన్‌లాల్, శరత్‌కుమార్ వంటి అగ్ర నటులు భాగమవుతున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఆయన ఈ సినిమా సెట్స్‌లో జాయిన్ అయ్యారు.
శ్రీకాళహస్తి స్థలపురాణం ఆధారంగా శివుడి పరమభక్తుడైన కన్నప్ప ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అచంచలమైన భక్తి భావానికి, విశ్వాసానికి ప్రతీకలా ఈ సినిమా అందరినీ మెప్పిస్తుందని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాలో ప్రభాస్ మానవరూపంలోని నందీశ్వరుడి పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఈ చిత్రానికి ముఖేష్‌కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ‘రాజా సాబ్’ చిత్రంలో నటిస్తున్నారు. ‘సలార్’ సీక్వెల్ ‘శౌర్యంగపర్వం’ ఈ నెలలోనే సెట్స్‌మీదకు వెళ్లనుంది.