Fire Accident | ఇండోనేషియా (Indonesia)లో ఘోర అగ్ని ప్రమాదం (Fire Accident) సంభవించింది. రాజధాని జకర్తా (Jakarta)లోని ఏడంతస్తుల భవనంలో (Seven Story Building) మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు. అనేక మంది గాయపడ్డారు.
స్థానిక మీడియా కథనాల ప్రకారం.. జపనీస్ డ్రోన్ సంస్థ టెర్రా డ్రోన్ కార్పొరేషన్ బిల్డింగ్‌లో మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తొలుత మొదటి అంతస్తులో మంటలు చెలరేగగా.. కాసేపటికే అవి భవనం మొత్తం వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకూ 20 మంది మరణించినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపుచేసినట్లు చెప్పారు. భవనంలోని పలువురు కార్మికులు పై అంతస్తుకు చేరుకొని నిచ్చెనల సాయంతో తప్పించుకున్నట్లు సదరు అధికారులు వివరించారు. ప్రమాదానికి సంబంధించిన దృష్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Momen saat ruko Terra Drone, Cempaka Baru, Kemayoran, Jakarta Pusat terbakar, Selasa (9/12). Damkar sudah evakuasi 20 kantong jenazah. pic.twitter.com/jSY5xeREyv
— Akuratco (@akuratco) December 9, 2025
Also Read..
Thailand-Cambodia | థాయ్-కంబోడియా మధ్య సైనిక ఘర్షణ.. ఎనిమిది మంది మృతి
Starlink | భారత్‌లో స్టార్‌లింక్ సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రకటించలేదు : మస్క్ సంస్థ