Thailand-Cambodia | థాయ్-కంబోడియా మధ్య సైనిక ఘర్షణ.. ఎనిమిది మంది మృతి
Thailand-Cambodia | థాయ్‌లాండ్-కంబోడియా (Thailand-Cambodia) సరిహద్దుల్లో మళ్లీ ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే.
Thailand-Cambodia | థాయ్‌లాండ్-కంబోడియా (Thailand-Cambodia) సరిహద్దుల్లో మళ్లీ ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణల్లో ఎనిమిది మంది మరణించగా.. డజన్ల కొద్దీ గాయపడ్డారు. గత రెండు రోజుల్లో థాయ్ సైనిక కాల్పుల్లో ఏడుగురు కంబోడియా పౌరులు మరణించారని, 20 మంది గాయపడ్డారని కంబోడియా జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు తమ వైపు నుంచి ఓ సైనికుడు మరణించాడని, 18 మంది గాయపడినట్లు థాయ్ సైన్యం ధృవీకరించింది. తాజా ఘర్షణలపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు దేశాలూ సంయమనం పాటించాలని సూచించారు. కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు.
కాగా, ఈ ఏడాది జులైలో థాయ్‌లాండ్, కంబోడియా మధ్య ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సరిహద్దుల పొడవున అనేక ప్రాంతాల్లో ఇరుదేశాలకు చెందిన సైనికుల మధ్య భీకర ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణలలో సైనికులతోపాటూ పౌరులు కూడా మరణించారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో ట్రంప్ రంగంలోకి దిగారు. కౌలాలంపుర్‌లో ఇరు దేశాల మధ్య సంధి కుదిర్చారు. ట్రంప్ సమక్షంలో థాయ్‌లాండ్-కంబోడియా దేశాలు శాంతి ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీంతో సరిహద్దుల్లో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. అయితే, ఐదు నెలల్లోనే మళ్లీ అక్కడ ఘర్షణలు చెలరేగడం ఆందోళన కలిగిస్తోంది.
Also Read..
Starlink | భారత్‌లో స్టార్‌లింక్ సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రకటించలేదు : మస్క్ సంస్థ
Donald Trump: బియ్యం దిగుమతులపై భారత్‌కు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

