టోక్యో: జపాన్ తీరం సోమవారం భారీ భూకంపంతో వణికింది. దీని తీవ్రత భూకంప లేఖినిపై 7.6గా నమోదైంది. సముద్రపు అలలు 3 మీటర్ల ఎత్తుకు ఎగసిపడ్డాయి. దీంతో జపాన్ వాతావరణ సంస్థ హొక్కాయిడో, ఔమోరి, ఇవాటే ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలను జారీ చేసింది. భూకంపం ప్రభావం గురించి తెలిపే వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పలువురు పోస్ట్ చేశారు. ఒక నిమిషానికిపైగా భూమి కంపించినట్లు ఓ యూజర్ తెలిపారు. జపాన్లో తరచూ భూకంపాలు రావడానికి కారణం ఏమిటంటే, ఈ భూభాగం పసిఫిక్ ప్లేట్, ఫిలిప్పైన్ సీ ప్లేట్, యూరాసియన్ ప్లేట్, నార్త్ అమెరికన్ ప్లేట్ కలిసే చోట ఉంది.