ఆదివారం 17 జనవరి 2021
International - Dec 15, 2020 , 10:53:09

న్యూజిలాండ్‌లో హెలికాప్ట‌ర్ కూలి ఇద్ద‌రు మృతి

న్యూజిలాండ్‌లో హెలికాప్ట‌ర్ కూలి ఇద్ద‌రు మృతి

విల్లింగ్ట‌న్ : న్యూజిలాండ్‌లో మంగ‌ళ‌వారం ఉద‌యం ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. కైకౌరా స‌మీపంలో న‌దీ తీరంలో హెలికాప్ట‌ర్ కూలిపోయింది. ఈ ప్ర‌మాదం సంభ‌వించిన‌ప్పుడు హెలికాప్ట‌ర్‌లో మొత్తం ఐదుగురు వ్య‌క్తులు ఉన్నారు. వీరిలో ఇద్ద‌రు అక్క‌డిక‌క్క‌డే మృతి చెంద‌గా, మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసు సిబ్బంది స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టింది. గాయ‌ప‌డ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై పౌర విమాన‌యాన శాఖ ద‌ర్యాప్తు చేస్తోంది.