Donald Trump | టారిఫ్‌ల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా మరో బాంబు పేల్చారు. 14 దేశాల (14 countries)పై కొత్త వాణిజ్య పన్నులు (US Tarrifs) విధించనున్నట్లు ప్రకటించారు. అత్యధికంగా మయన్మార్, లావోస్‌పై 40 శాతం సుంకాన్ని విధించనున్నట్లు ప్రకటించారు. ఈ సుంకాలు ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.
అప్పటిలోపు కొత్త వాణిజ్య ఒప్పందాలు కుదరకపోతే పెరిగిన దిగుమతి సుంకాలను అమలు చేస్తామని హెచ్చరిస్తూ ఆయా దేశాలకు లేఖలు పంపినట్లు ట్రంప్ తెలిపారు. అమెరికాపై ప్రతీకార సుంకాలను విధించే దేశాలను ఉపేక్షించేది లేదన్నారు. జులై 9 డెడ్‌లైన్ ముగుస్తున్నందున, అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోని దేశాలపై భారీ సుంకాల విధింపునకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ సంతకం చేస్తారని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలైన్ లీవిట్ వెల్లడించారు.
14 దేశాలపై ట్రంప్ విధించనున్న సుంకాలివీ..
Also Read..
Trump Tariffs | భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి దగ్గరలో ఉన్నాం: డొనాల్డ్ ట్రంప్
Donald Trump | నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్‌ను నామినేట్ చేసిన నెతన్యాహూ
10 శాతం అదనపు సుంకాలు విధిస్తాం