Bus Crash | చైనా (China)లో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ పాఠశాల బస్సు (School Bus) అదుపుతప్పి (Bus Crash) విద్యార్థులు, తల్లిదండ్రులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
షాన్డాంగ్ ప్రావిన్స్ (Shandong province)లోని తైవాన్ నగరంలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు అదుపుతప్పి రోడ్డుపై వెళ్తున్న చిన్నారులు, తల్లిదండ్రులపైకి దూసుకెళ్లినట్లు స్థానిక మీడియా నివేదించింది. ఈ ఘటనలో ఆరుగురు తల్లిదండ్రులు, ఐదుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. పదుల సంఖ్యలో గాయాలపాలైనట్లు తెలిపింది. క్షతగాత్రులు ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు పేర్కొంది. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
Also Read..
Underwear Gang | నాసిక్‌లో చెడ్డీ గ్యాంగ్ హల్చల్.. 70 గ్రాముల బంగారం, అరటిపళ్లు చోరీ
Jupally Krishna Rao | మంత్రి జూపల్లి ఇలాకాలో ప్రభుత్వ స్థలాలు కబ్జా
Sagar Left Canal | సాగర్ ఎడమ కాలువకు గండి.. పరిశీలించిన బీఆర్ఎస్ నేతలు